Gujarat CM Anandiben Patel announces Rs 1,000 crore package for EWS

Hc pulls up hardik patel lawyer you took court for a ride

hardik patel, patel patel protest, patidar protest, gujarat, gujarat high court, gujarat hc, patidar community, patidar agitar, hardik patel, bjp mahila morcha, quota agitation

Anandiben Patel announced the package at end of the 10-day deadline set for the government to resolve the impasse during its meeting with the Patidar Anamat Andolan Samiti.

హార్థిక్ కు హైకోర్టులో చుక్కెదురు.. రూ. వెయ్యికోట్ల ప్యాకేజీ ప్రకటించిన అనందీ బెన్

Posted: 09/25/2015 04:52 PM IST
Hc pulls up hardik patel lawyer you took court for a ride

గుజరాత్‌లో మంగళవారం పటేళ్ల రిజర్వేషన్లపై తాము నిర్వహించిన ఓ బహిరంగ సభ తర్వాత తనను గుర్తతెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారంటూ పటీదార్ అనామత్ అందోళన్ నేత హార్దిక్ పటేల్ చెప్పేదంతా కట్టుకథలా ఉందంటూ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అనవసరంగా కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని హార్దిక్‌ను, ఆయన తరపు న్యాయవాదిని మందలించింది. మంగళవారం ఆరావళి జిల్లాలో ప్రజాసభ తర్వాత హార్దిక్ అదృశ్యం నేపథ్యంలో ఆయన అనుచరుడు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను గురువారం డివిజన్ బెంచ్ విచారించింది. అవసరమనుకుంటే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తుచేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదావేసింది.

ఇదిలావుండగా, గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లలో స్థానం కల్పించలేమని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్  స్పష్టం చేశారు. ఇదే సమయంలో వారి సంక్షేమం కోసం రూ. 1000 కోట్ల భారీ ప్యాకేజీని ఇవ్వనున్నట్టు తెలిపారు. పటేల్ కమ్యూనిటీ యువకులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకరిస్తామని, ఇతర సౌకర్యాలకు ఈ నిధులను వాడుతామని ఆమె స్పష్టం చేశారు. పటేళ్లు చేస్తున్న ఆందోళనలను విరమించాలని ఆమె కోరారు. కాగా, ఈ ప్యాకేజీ ఓ లాలీపాప్ వంటిదని యువనేత హార్దిక్ పటేల్ ఎద్దేవా చేశారు. ఇటువంటి తాత్కాలిక ప్యాకేజీలు తమకు అవసరం లేదని తెలిపారు. తమ ఏకైక లక్ష్యం రిజర్వేషన్లు మాత్రమేనని వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  gujarat high court  kidnap drama  court time  warns  

Other Articles