Bollywood Biggies Take On Twitter To Wish You All ‘Eid Mubarak’

Eid mubarak bollywood celebrities extend best wishes to their fans

Amitabh Bachchan, Shah Rukh Khan, Priyanka Chopra, Anushka Sharma, Nimrat Kaur, Kriti Sanon, Arjun Kapoor, auspicious occasion, Bakrid, muslim fans, Muslim community,Bollywood Biggies, bollywood celebrities bakrid wishes, twitter

The auspicious occasion of Bakrid is here, and people from Muslim community all across India are busy celebrating the beautiful festival today.

మహ్మదీయ సోదరులకు బాలీవుడ్ ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు

Posted: 09/25/2015 04:55 PM IST
Eid mubarak bollywood celebrities extend best wishes to their fans

బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ అభిమానులు, ప్రజలకు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దువా కోరుతున్నట్లున్న ప్రత్యేక ఫొటోతో 'ఈద్ ముబారఖ్.. శుభాకాంక్షలను తెలిపారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ పండుగ అందరికి శాంతి, ప్రేమ, సంతోషాలను పంచాలి' అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక పండగ పూట కూడా విరామం లేకుండా 'దిల్వాలే' షూటింగ్ లో ఉన్న షారూఖ్ ఖాన్.. 'ఈద్ అల్ అదా శుభాకాంక్షలు. అల్లాహ్ దయ, ఆశీర్వాదాలతో అందరికి మంచి ఆరోగ్యం, సంపదలు కలగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.

అందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ బాలీవుడ్ నాటి తరం నెంబర్ వన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. 'ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ జరుపుకొంటున్నవారందరికి శుభాకాంక్షలు. అల్లాహ్ శాంతి, సమామరస్యాల్ని ప్రసాదించాలి' అంటూ న్యూయార్క్ లో ఉన్న ప్రియాంక చోప్రా ట్వీట్లు చేశారు. వీరితో పాటుగా మహ్మదీయ సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలను తెలిపారు అనుష్క శర్మ. ఇక సోనాక్షి సిన్హా, శృతి హాసన్, అర్జున్ రాంపాల్, హుమా ఖురేషీ, ఆతియా షెట్టి, రవీనా టాండన్, సుస్మితా సేన్,  సోహా అలీఖాన్ తదితరులు కూడా అభిమానులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood celebrities  bakrid wishes  twitter  amitabh bachan  

Other Articles