Governor rejects Sanjay Dutts plea

Governor rejects plea to cancel sanjay dutts jail term

sanjay dutt, Governor, jail, Markandey Katju, Maharashtra Governor, Ch.Vidyasagar Rao

Governor rejects plea to cancel Sanjay Dutts jail term. Exactly two and a half years after former Supreme Court judge Markandey Katju made an impassioned plea seeking pardon for Sanjay Dutt, Maharashtra Governor Ch.Vidyasagar Rao has rejected the appeal. Katju had written letters to the President, then Prime Minister Manmohan Singh and Union Home Minister Sushilkumar Shinde after a discussion with noted criminal lawyer Majid Memon and others in March 2013. Their decision came after Sanjay Dutt broke down in front of the media and declared that he was not going to seek pardon and would go by the Supreme Court decision.

ITEMVIDEOS: సంజయ్ దత్ ను కణికరించని గవర్నర్

Posted: 09/24/2015 03:39 PM IST
Governor rejects plea to cancel sanjay dutts jail term

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు నిరాశ మిగిలింది. ఇప్పటికే 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమాయుధాల చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ కు తాజాగా మరోసారి నిరాశ ఎదురైంది. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన కేసులో సంజయ్ దత్ కీలక నిందితుడు. అయితే భారతదేశంలో వ్యవస్థ ఎంత ఆలస్యంగా స్పందిస్తుందో చెప్పడానికి తాజాగా సంజయ్ దత్ కేసునే ఉదహరిస్తున్నారు కొంత మంది మేధావులు. రెండున్నరేళ్ల క్రితం జస్టిస్ మార్కండేయ కట్జూ అప్పట్లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా.. సంజయ్ దత్ కు క్షమాభిక్ష పరీశీలించాలని లేఖ రాశారు. అయితే ఇప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించింది.

1993 ముంబై పేలుళ్ల కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సెర్చ్ లో భాగంగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. దాంతో కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయగా.. కోర్ట్ సంజయ్ దత్ కు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే తనకు విధించిన శిక్షను తగ్గించాలని గతంలో సంజుబాబా కోర్ట్ ను కోరారు. అయితే తన శిక్ష కాలాన్ని తగ్గించాలంటూ క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. అయితే దీని మీద సుప్రీంకోర్ట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దాని మీద లేట్ గా అంటే దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత స్పందింన వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్ష పిటిషన్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావ్ తిరస్కరించారు. సంజయ్ దత్ కు విధించిన శిక్ష సరైందేనని.. ఎలాంటి క్షమాభిక్ష అవసరం లేదంటూ గవర్నర్ వెల్లడించారు. అయితే ఇందులో ఇంకో కొసమెరుపు ఏంటంటే... ఫిబ్రవరి 2016 నాటికి ముగుస్తోంది. మరో ఏడు నెలలు ఆగితే ఎలాగూ బయటికి వస్తారు అలాంటప్పుడు క్షమాభిక్ష టాపిక్ ఇప్పుడు తెర మీదకు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay dutt  Governor  jail  Markandey Katju  Maharashtra Governor  Ch.Vidyasagar Rao  

Other Articles