Death toll rises to 250 in stampede during haj outside Mecca

Haj stampede at least 250 pilgrims killed 600 injured near makkah

Haj stampede, Mecca, Hajj, Islam, Hajj crush, stampede, Quran, pilgrims, Saudi Arabia, Haj 2015,Saudi Arabia train,haj pilgrims,train accident,Eid al-Adha,Mount Arafat,Mount Arafah,special metro train, Hajj yatra , Mecca , hajj tragedy , Mecca stamped , Saudi Arebia

At least 250 pilgrims were killed on Thursday in a stampede at Mina, outside the Muslim holy city of Mecca, where some two million people are performing the annual haj pilgrimage, Saudi Arabia’s al-Ekhbariya television reported.

ITEMVIDEOS: హాజ్ యాత్రలో పెనువిషాదం.. తొక్కిసలాటలో 250 మంది మృతి..

Posted: 09/24/2015 03:06 PM IST
Haj stampede at least 250 pilgrims killed 600 injured near makkah

బక్రీద్ పండగ పర్వదినాన.. పవిత్ర హజ్ యాత్రలో పెను విషాదం సంభవించింది. మక్కా మసీదు వెలుపల ఐదు కిలోమీటర్ల దూరంలోని మీనా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తోక్కిసలాట చోటుచేసుకోవడంతో సుమారుగా 250 మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 600మందికి పైగా గాయపడ్డారు.  సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న ఒక్కరోజే సుమారుగా 20 లక్షలమంది ముస్లింలు హజ్‌లో పాల్గొన్నారు. అర్ఫా మైదాన్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన యాత్రికులు ఒక్కసారిగా ముందుకు తోకుసురావడంతో.. తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. మృతదేహాలను సేకరించిన అధికారులు..తొక్కిసలాటలో గాయపడిన వారిని అసుపత్రులకు తరలించారు.

ఈ సారి హాజ్ యాత్రకు వివిధ దేశాల నుంచి దాదాపు 25 లక్షల మందికి పైగా ముస్లింలు హాజ్ కు చేరుకున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అయితే మరణించిన వారి వివరాలను సేకరించిన తరువాత తెలియజేయనున్నట్లు మక్కా అధికారులు తెలిపారు. మృతుల్లో భారతీయులు ఎవరైనా వున్నారా..? లేక క్షతగాత్రులలో వున్న భారతీయులను వివరాలను సేకరించే పనిలో భారత విదేశాంగ శాఖ తలమునకలైంది. సౌదీలోని భారతీయ విదేశాంగ కార్యాలయ అధికారులు ఈ వివరాలను సేకరించే పనిలో వున్నారు.

కాగా సెప్టెంబర్ నెలలోనే ఇది రెండో దుర్ఘటన. ఈ 14న జరిగిన క్రేన్ కూలిన ఘటనలో 107 మంది యాత్రికులు చనిపోయారు.  15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన.  కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయినా యాత్రికులను నియంత్రించే విషయంలో, భారీ సంఖ్యలో వచ్చే యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమయ్యిందన్ని విమర్శలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haj stampede  Mecca  Hajj  Islam  Hajj crush  stampede  Quran  pilgrims  Saudi Arabia  

Other Articles