The Ghost Smugglers Narayan Yadav And Two Other Arrests Who Sold Ghosts To Poor People In Chhattisgarh | Ghost Business

Ghost smugglers narayan yadav two other members police arrests chhattisgarh jashpur

ghost smugglers, narayan yadav ghost seller, ghost sellers india, hanuman chalisa, ghost smugglers updates, ghost smugglers news, Chhattisgarh crime news, jashpur ghost sellers

Ghost Smugglers Narayan Yadav Two Other Members Police Arrests Chhattisgarh Jashpur : The Ghost Smugglers Narayan Yadav And Two Other Arrests Who Sold Ghosts To Poor People In Chhattisgarh.

‘దెయ్యాలు’ అమ్ముతున్న వ్యక్తుల భరతం పట్టిన పోలీసులు

Posted: 09/21/2015 04:40 PM IST
Ghost smugglers narayan yadav two other members police arrests chhattisgarh jashpur

‘వ్యాపారం సజావుగా సాగాలంటే వినియోగదారుడి బలహీనతలు తెలుసుకుంటే చాలు’.. ఇది బిజినెస్ ప్రాథమిక సూత్రం. ఈ సూత్రం మీద ఆధారపడే చాలామంది వ్యాపారస్తులు జీవనాధారం పొందుతున్నారు. ఈ వర్తక సూత్రాన్ని మరింత బాగా పసిగట్టిన ఓ వ్యక్తి.. జనాల్ని ఎలా బురిడి కొట్టించాడంటే ఏకంగా దెయ్యాలనే అమ్మేసి సొమ్ము పొగేసుకుంటున్నాడు. అవును.. దెయ్యాలున్నాయని ప్రగాఢంగా విశ్వసించే ప్రజల్ని టార్గెట్ చేసుకుని, తన దగ్గర మంచి దెయ్యాలున్నాయంటూ తన వ్యాపారాన్ని బాగానే కొనసాగించాడు ఆ ప్రబుద్ధుడు. ఇతని నిర్వాకాన్ని పసిగట్టిన పోలీసులు.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చివరగా అతనిని అరెస్టు చేసి, భరతం పట్టించారు. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని జస్ పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్కోబ్ గ్రామస్తులకు దెయ్యాలున్నాయని ప్రగాఢ విశ్వాసం. ఆ దెయ్యాలని మంచి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. అయితే.. ఆ గ్రామస్తుల గుడ్డి నమ్మకాన్ని గమనించిన నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి... వారి నమ్మకాన్నే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు. తన దగ్గర మంచి దెయ్యాలు ఉన్నాయని, వాటిని కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందని పేర్కొంటూ వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. ‘దెయ్యాలే లేవు, నీదంతా బూటకపు వ్యాపారం’ అని ఎవరైనా నిలదీస్తే.. ‘దెయ్యాలున్నవిషయం హనుమాన్ చాలీసాలో ఉంది.. చూసుకోండ’ని చెబుతాడు. పైగా.. దెయ్యాలు ఎలాగో కనిపించవు గనుక.. అతని వాదనని గ్రామస్థులు గుడ్డిగా నమ్మేవారు. అంతే! మనోడికి సంపాదించే మార్గం మరింత సులువు కావడంతో.. తన దెయ్యాల వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాడు. గ్రామస్థుల అవసరాలు కనిపెట్టి, వారిని భయపెట్టి, దెయ్యాలు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. అతనితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ వ్యాపారంలో భాగస్వాములుగా వున్నారు. కొన్నాళ్లు వీరి దెయ్యాల వ్యాపారం సజావుగానే సాగింది.

ఈ నేపథ్యంలోనే నారాయణ్, అతని సహచరులపై కొందరికి అనుమానం కలిగింది. వారు చేస్తోంది బూటకపు వ్యాపారమని పసిగట్టి.. ఆ ముగ్గురి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తొలుత పోలీసులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు కానీ.. చివరగా వారికి నిజంగా దెయ్యాలు అమ్ముతున్నారని నిర్ధారణ అయింది. దీంతో అవాక్కైన పోలీసులు.. నారాయణ్ యాదవ్, అతని ఇద్దరు అనుచరులకు అరదండాలేసి తీసుకెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghost Smugglers  Chhattisgarh Crime News  

Other Articles