Rahul calls to Attack on Narendra Modi

Rahul calls to attack on modi

Modi, narendra Modi, Rahul Gandhi, Uttarpradesh, Steve jobs, apple, Congress, BJP, NDA

Steve Jobs' resurrection of Apple's fortunes was the example cited by Rahul Gandhi as he asked his party workers to rebuild the Congress in Uttar Pradesh, which votes in two years for its next government.

మోదీ మీద దాడి చెయ్యండి అంటున్నాడు

Posted: 09/21/2015 03:27 PM IST
Rahul calls to attack on modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద దాడికి దిగాలని ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అయితే దాడి అంటే ఫిజికల్ గా కాదు.. మాటలల ద్వారా మోదీపై, మోదీ సర్కార్ మీద దాడికి దిగాలని రాహుల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తంగా మోదీని ఓ వైపు సూట్ బూట్ వాలా సర్కార్ అని తిడుతూనే మరోపక్క. పార్టీ కార్యకర్తలకు కూడా మోదీని తిట్టేందుకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గత కొంత కాలంగా ఎదురవుతున్న వ్యతిరేక పవనాల మీద కూడా రాహుల్ దృష్టిసారించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా పనిచెయ్యాలి అన్న దాని మీద ఏకంగా ఆపిల్ ఫోన్ స్థాపకుడిని ఉదాహరణగా వివరించారు. అందరూ కష్టపడి పనిచేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని నెంబర్ వన్ గా మార్చాలని రాహుల్ ఆకాంక్షించారు.

Also Read: రాహుల్ గాంధీ.. మీ నాన్న.. మీ తాత కూడా

Also Read: మోడీది మేక్ కాదు.. టేక్ ఇన్ ఇండియా అంటూ రాహుల్ విసుర్లు

రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో ఓ సభలో పాల్గొన్నారు. మధురలోని ఓ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన రాహుల్ గాంధీ తర్వాత అక్కడి సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తరహాలో కష్టపడి పనిచెయ్యాలని.. పిలుపునిచ్చారు. బ్లాక్ మనీని తిరిగి ఇండియాకు తెప్పిస్తామని హామీ ఇచ్చారని కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రతి భారతీయుడి అకౌంట్లో నల్లధనాన్ని తిరిగి తెప్పిస్తామని అన్నారని గుర్తుచేశారు. రైతులకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని చూశారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా రాహుల్ పిలుపునిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  narendra Modi  Rahul Gandhi  Uttarpradesh  Steve jobs  apple  Congress  BJP  NDA  

Other Articles