Nehru and Rajiv wore suits too

Nehru and rajiv wore suits too

Hitting out at Congress vice-president Rahul Gandhi for his “suit boot” remarks against Narendra Modi, Union minister M. Venkaiah Naidu on Sunday termed it as “childish and immature” and accused him of taking the name of Prime Minister to remain in the news.

Hitting out at Congress vice-president Rahul Gandhi for his “suit boot” remarks against Narendra Modi, Union minister M. Venkaiah Naidu on Sunday termed it as “childish and immature” and accused him of taking the name of Prime Minister to remain in the news.

రాహుల్ గాంధీ.. మీ నాన్న.. మీ తాత కూడా

Posted: 09/21/2015 12:33 PM IST
Nehru and rajiv wore suits too

ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆశా కిరణం రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద మరోసారి విమర్శల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ వేసుకున్న సూట్ మీదే మరోసారి విమర్శలు చేశారు. మోదీ సర్కార్ సూట్ బూట్ సర్కార్ అని అన్నారు. ఒబామా పర్యటన సందర్భంగా మోదీ  లక్షల విలువ చేసే సూట్ ను వేసుకోవడం మీద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దృష్టిసారించారు. అయితే దీని మీద బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తాతలు, తండ్రుల చిట్టా విప్పి మరీ తిట్ల పురాణం మొదలుపెట్టారు. ముందు మీ సంగతి చూసుకోండి.. తర్వాత మా సంగతి చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Readమళ్లీ సూట్ బూట్ కొట్టిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువరాజు, ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. ప్రతిసారి మోదీ సూట్ మీదే విమర్శలు చేస్తున్నారు. మోదీ సర్కార్ సూట్ బూట్ వాలా సర్కార్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీని మీద చిర్రెత్తుకొచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ జీ మీ తండ్రి రాజీవ్ గాంధీ, మీ తాత జవహర్ లాల్ నెహ్రూ కూడా సూట్ లు వేసుకొని తిరిగారని.. ఆ విషయాలను మరిచిపోవద్దు అంటూ గుర్తు చేశారు. అయినా రాహుల్ ది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఇంకా పరిణతి రాలేదని అన్నారు వెంకయ్య నాయుడు. మొత్తానికి రాహుల్ గాంధీ మోదీ మీద చేస్తున్న విమర్శల పర్వం మాటల యుద్దానికి దారి తీస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Narendra Modi  Venkaiah Naidu  nation? Rajiv gandhi  Nehru  Suit  Suit boot sarkar  

Other Articles