Adorable Baby Fakes Crying When Daddy Tries To Cut Her Fingernails

Baby fake cry while dad tries to cut nails

baby cries while dad cut nails, dad cut nails baby cries, viral videos, Baby fake cry while dad cut nails, little boys fake cry, viral on internet, viral videos, viral on social networking sites, viral on whatsapp, Nail, Health, Cute, Funny, Laughing, Nine, Castle, Baby, Cuteness

cute baby, who gives a fake cry, while her dad attempts to cut the fingernails. the video is getting viral on the net, and is trending in the social networking sites, since its release.

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్ చేస్తున్న బుజ్జిగాడి దొంగ ఏడుపు..!

Posted: 09/18/2015 09:53 PM IST
Baby fake cry while dad tries to cut nails

పిల్లలు పుట్టగానే డాక్టర్లు తప్పకుండా ఇచ్చే ఓ జాబితాను పట్టుకుని ఏ తల్లిదండ్రైనా బయటకు వస్తారు.. అదేంటా అంటే పిల్లలకు ఏ సమయంలో ఏ ఏ టీకాలు వేయించాలి, ఎన్ని రోజులప్పుడు ఏ మందులు వాడాలని అని.. అయితే అదే సమయంలో కొన్ని బడా అసుపత్రులు మాత్రం మీ పిల్లాడు ఎపుడు తొలిసారిగా ఏడ్చాడు.. తొలిసారిగా పాకాడు, తొలిసారిగా తిన్నాడు, తొలిసారిగా నడిచాడు.. తొలిసారిగా తన్నాడు.. తొలిసారిగా అంటూ చెంతాడంత జాబితా ఇస్తుంటారు. ఎందుకంటే వాటిలో తేదీలు రాసి వాటిని పథిలపర్చుకునేందుకు. అయితే ఇప్పుడు ఈ చెంతాడంతా జాబితా అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. ఏం చేసినా.. కేవలం తేదీలతోనే కాదు.. ఎలా చేశాడన్నది కూడా రికార్డింగ్ చేసుకుని తమ ఫోన్లలో, కంప్యూటర్లలో పథిలపర్చుకుంటున్నారు కాబట్టి.

అలాంటి పనే ఇక్కడ ఒక తండ్రి చేశాడు. తన కొడకు వేళ్లకు వున్న గొళ్లను కత్తిరించేందుకు ఉపక్రమించాడు. తనలా బాబు కూడా అతని వేళ్ల గోళ్లను కత్తరించుకునే సమయంలో ఎలా భయపడతాడన్నది చిత్రీకరించాలని సెల్ ఫోన్లో మొత్తం ఇతివృత్తాన్ని బంధించాడు. అయితే దానిని యుట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అనుకోకుండా దానికి భారీగా హిట్స్ వచ్చాయి. ఈ నెల 12న పెట్టిన తన బుజ్జిగాడి ఏడుపును వారం రోజులు కూడా గడవకముందే సుమారుగా ఆరు లక్షల మంది వీక్షించారు. ఎందుకు..? ఏమిటీ ఈ వీడియోలోని ప్రత్యేకం.. ఈ బుజ్జిగాడి ఏడుపుకు అంత డిమాండ్ ఎందుకు..? అనుకుంటున్నారా..? అలోచించడం మానేసి వీడియోని చూస్తే పోలా...!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baby  nails  viral videos  dad  video  social media  internet  

Other Articles