From ice cream to chappal, the most unusual election symbols in bihar polls

Bihar polls green chilli ice cream cauliflower are election symbols

Elections, Bihar Elections 2015, 2015 Bihar polls, Congress, Bharatiya Janata Party (BJP), Hindustani Awam Morcha (HAM), Jitan Ram Manjhi, green chilli, election symbols

Green chilli, cauliflower, telephone, ice cream, shoe, chappals and bucket are some of the election symbols allotted to registered, unrecognised political parties contesting the Bihar polls.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల పేర్లే కాదు.. గుర్తులు కూడా కడు చిత్రం..

Posted: 09/18/2015 09:52 PM IST
Bihar polls green chilli ice cream cauliflower are election symbols

ఐస్ క్రీమ్, పచ్చిమిర్చి, క్యాలీ ఫ్లవర్, టెలిఫోన్, షూ, చెప్పులు, బకెట్.. సూపర్ మార్కెట్ నుంచి తీసుకురావాల్సిన ఐటమ్స్ లిస్ట్ చెబుతున్నట్టు అనిపిస్తుంది కదూ. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఇవన్నీ ఎన్నికల గుర్తులు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కొన్ని రాజకీయపార్టీలకు కేటాయించిన ఎన్నికల గుర్తులు. నిజమండీ ఈ సారి ఎన్నికలలో స్వతంత్రంగా పోటీచేసు అభ్యర్థులకు కడు చిత్రమైన గుర్తులను కేటాయించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. హస్తం, సైకిల్, కమలం లాంటివి గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు గుర్తులుగా ఉండటంతో మిగిలిన పార్టీలకు ఇలాంటి గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించింది.

గుర్తులే కాదు.. వివిధ పార్టీల పేర్లు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఆప్ ఔర్ హమ్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, సాథీ ఔర్ ఆప్ కా ఫైస్లా పార్టీ, నేషనల్ రోడ్ మ్యాప్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామ్ మోర్చా పార్టీకి టెలిఫోన్ గుర్తును కేటాయించారు. ఆ పార్టీ పోటీ చేయబోతున్న 243 సీట్లకు ఇదే గుర్తు ఉంటుంది. అలాగే మరో పార్టీ లోక్ ఆవాజ్ దళ్కు పచ్చిమిర్చి ఎన్నికల గుర్తుగా లభించింది. 50 సీట్లకుగాను ఈ గుర్తు కేటాయించారు. ఇక ఐస్ క్రీమ్ గుర్తును ఆమ్ జనతా పార్టీ రాష్ట్రీయకు కేటాయించారు. అక్టోబర్ 12 నుంచి మొదలవుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 56 రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Elections 2015  green chilli  cauliflower ice cream  election symbols  

Other Articles