Time for ghar wapsi VHP advises A R Rahman to reconvert

Vhp advises a r rahman to reconvert

Vishwa Hindu Parishad , A.R. Rahman, Prophet Muhammad, Time for ghar wapsi, ghar wapsi

Time for ghar wapsi VHP advises A R Rahman to reconvert Vishwa Hindu Parishad on Wednesday asked noted music director A.R. Rahman, whose composition for a film on Prophet Muhammad (PBUH) has invited a fatwa against him, to re-convert to Hinduism, saying it was time for his “ghar-wapsi.”

ఎ.ఆర్.రెహమాన్ మతం మార్చుకో..

Posted: 09/18/2015 10:07 AM IST
Vhp advises a r rahman to reconvert

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్ రెహమాన్ మీద వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఎ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన ఓ సినిమా మీద ముస్లిం పెద్లలు ఫత్వా జారీ చేశారు. మహ్మద్ ను కించపరిచేలా ఉన్న సినిమా మీద ఫత్వా విడుదల చేసినట్లు ముస్లిం మతానికి చెందిన ఓ వర్గం ఫత్వా జారీ చేసింది. సినిమా డైరెక్టర్ తో పాటు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రెహమాన్ కు కూడా ఫత్వా జారీ చేసింది. అయితే దీని మీద రెహమాన్ చాలా సున్నితంగా స్పందించారు. కాగా రెహమాన్ తిరిగి హిందు మతంలోకి రావాలని వి.హెచ్.పి నేత పిలుపునిచ్చారు, ఘర్ వాపసీ కింద రెహమాన్ తిరిగి తన మతం మార్చుకోవాలని హితవు పలికారు.

మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కొన్నేళ్ల కిందట హిందు మతం నుండి ముస్లిం మతానికి మారారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా మతాన్ని మార్చుకున్నారు. అయితే తాజాగా రెహమాన్ మీద జారీఐన ఫత్వాతో వి.హెచ్.పి నేతలు రెహమాన్ కు సలహాలిస్తున్నారు. ‘‘తిరిగి హిందు మతంలోకి చేరాలని... ఒక్క ఫత్వా కాదు ఎన్ని ఫత్వాలు వచ్చినా మీకు ఏమీ కాదని.. హిందూ మతం తిరిగి చేరే వారి కోసం ఎదురుచూస్తోంది’’ అంటూ సురేందర్ జైన్ అనే వి.హెచ్.పి నేత హితవు పలికారు. మరి రెహమాన్ వీటి మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishwa Hindu Parishad  A.R. Rahman  Prophet Muhammad  Time for ghar wapsi  ghar wapsi  

Other Articles