Somnath Bharti booked in a domestic violence case

Former delhi law minister somnath bharti booked in a domestic violence case

Somnath Bharti, Delhi, domestic violence case, AAP MLA,Former Delhi Law Minister

Former Delhi Law Minister Somnath Bharti booked in a domestic violence case Former Delhi Law Minister Somnath Bharti and AAP MLA, booked in a domestic violence case on his wife’s complaint, approached the Delhi High Court on Tuesday for anticipatory bail.

భార్యను చంపాలనుకున్న మాజీ మంత్రి

Posted: 09/18/2015 11:37 AM IST
Former delhi law minister somnath bharti booked in a domestic violence case

అవును మీరు చదువుతుంది నిజమే.. ఆ మాజీ మంత్రి మహాపుంగవులు తను కట్టుకున్న భార్యనే చంపాలనుకున్నాడు. అది కూడా ఒక్కసారి కాదు రెండు సార్లు తన భార్యను ఖతం చెయ్యాలనుకున్నాడు. ఈ వార్త వినగానే తెలుగు మంత్రిగారు ఎవరో అని అనుమానించకండి. ఆ మంత్రిగారు ఢిల్లీ ప్రభుత్వంలో ఓ మాజీ మంత్రిగా వెలగబెడుతున్నారు. ఢిల్లీలో కొలువైన ప్రభుత్వంలో సోమ్ నాథ్ ఛటర్జీ అనే పెద్దాయన నిర్వాకం మీద గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తన భర్త తనను చంపేందుకు ప్రయత్నించారని.. సోమ్ నాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటరాగేషన్ మొదలుపెట్టారు.

తాజాగా సోమ్ నాథ్ మీద కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆయన భార్య మీద ఎలా హత్యాయత్నానికి పాల్పడ్డారు అన్న విషయాలకు ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు పోలీసులు. మొదటిసారి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు హత్య చెయ్యడానికి ప్రయత్నించారని, రెండోసారి ఆమె మణికట్టు చీల్చి చంపేందుకు చూశారని పోలీసులు హైకోర్ట్ లో వెల్లడించారు. సోమ్ నాథ్ తన బార్య మీద కుక్కతో దాడి జరిపించేవారిని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమ్ నాథ్ బెయిల్ పిటిషన్ మీద కూడా కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరి మంత్రిగారి మీద హైకోర్ట్ ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Somnath Bharti  Delhi  domestic violence case  AAP MLA  Former Delhi Law Minister  

Other Articles