Ganesh Chaturthi fastival celebrations in telugu states

Ganesh chaturthi fastival celebrations in telugu states

Ganesh Chaturthi, Khairatabad, Hyderabad, Governor, narasimhan, Tapeshwaram, Laddu

Ganesh Chaturthi fastival celebrations in telugu states. In Hyderabad Khairatabad, Governor couple did first pooja at Ganesh.

ITEMVIDEOS: దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్య

Posted: 09/17/2015 11:18 AM IST
Ganesh chaturthi fastival celebrations in telugu states

వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణనాయకుడి విగ్రహానికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజను చేశారు. పూజ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దంపతులు గణేశున్ని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వినాయక చవితి సమీపిస్తోందంటే చాలు, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో కోలాహలం నెలకొనడం ఏళ్లుగా చూస్తున్నదే. వినాయక చవితి సందర్భంగా కొలువుదీరనున్న గణనాధుల విగ్రహాల చేతిలో లడ్డూలను ఉంచడం తెలిసిందే. ఈ లడ్డూలను చేజిక్కించుకునేందుకు నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి జరిగే వేలంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. ఖైరతాబాదు వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచుతున్న లడ్డూ గత కొన్నాళ్లుగా తాపేశ్వరంలో తయారవుతున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఖైరతాబాదు వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను తయారు చేశారు. ప్రస్తుత్తం తాపేశ్వరం నుంచి బయలుదేరిన ఈ లడ్డూ నేటి రాత్రి హైదరాబాదుకు చేరుకునే అవకాశాలున్నాయి. భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో మల్లిబాబు హైదరాబాదుకు తీసుకువస్తున్నారు. ఇక విశాఖలోని 82 అడుగుల భారీ గణేశుడి విగ్రహం చేతిలో పెట్టేందుకు 8,300 కిలోల లడ్డూ తయారైంది. ఈ లడ్డూ కూడా తాపేశ్వరంలోనే తయారైంది. ఈ లడ్డూ ఇప్పటికే విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం చెంతకు చేరింది. దీనిని తాపేశ్వరం కేంద్రంగా స్వీట్ల తయారీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీభక్తాంజనేయ స్వీట్స్ యజమాని సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) రూపొందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Chaturthi  Khairatabad  Hyderabad  Governor  narasimhan  Tapeshwaram  Laddu  

Other Articles