Basanti Kumari has the world at her feet

The teacher without hands she herself is a chapter

Teacher, Basanthi, Handicap

Despite her underdeveloped hands, 30-year old Basanti Kumari has the world at her feet. She has no arms and her fingers are abnormally tiny, due to a deformity at birth. Her parents had given up on her education, and had resigned to the fact she could never go to school.

ITEMVIDEOS: ఆ టీచర్ కు చేతులు లేకున్నా ఆత్మవిశ్వాసం

Posted: 09/12/2015 04:37 PM IST
The teacher without hands she herself is a chapter

ఒంట్లో అవయవాలు సరిగా లేని వాడు కాదు అవటి వాడు.. అన్ని సరిగ్గా ఉన్నా కానీ ఆత్మవిశ్వాసం లేని వాడే నిజమైన అవుటివాడు అన్న తెలుగు సినిమా డైలాగ్ అక్షరాల నిజం. కాళ్లూ చేతులూ అన్నీ సరిగ్గా ఉన్నా కానీ అసంతృప్తిగా ఎంతో మంది ఉంటారు. ఇక జీవితంలో ఎంతో ఉన్నా.. చిన్న చిన్న విషయాలకు చింతిస్తుంటారు. కానీ తమ శరీర భాగాల్లో ఉన్న లోపాన్ని పక్కకు పెట్టి.. లోకానికి ఆదర్శంగా నిలిచే ఎంతో మంది అంగవికలాంగులు మన మధ్యే ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునేందుకు ఖచ్చితమైన కారణం ఉన్నా కానీ బ్రతుకుతూ.. జీవిత పోరాటాన్ని సాగిస్తున్న ఎంతో మందికి మేమేం చేస్తున్నాం సెల్యూట్. బసంతి అనే ఓ టీచర్ కథ వింటే కంట్లో కన్నీళ్లు. గుండె నిండా దైర్ఘం వస్తాయి. బసంతి లాంటి వాళ్ల స్టోరీలను తెలుసుకొని విశ్వాసాన్ని మూటగట్టుకుంటారని ఈ స్టోరీని అందిస్తున్నాం.

బసంతికి పుట్టుకతోనే చేతులు లేవు.. మొత్తం ఐదుగురు సంతానంలో మొదటి బిడ్డగా పుట్టిన బసంతిని వాళ్ల తల్లి పదో తరగతి దాకా చదివించింది. దాంతో బసంతిలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి.. మరింత ఉత్సాహంతో దూసుకెళ్లింది. చివరకు బసంతి కష్టపడి చదివిన దానికి దేవుడు కరుణించాడు. బసంతికి టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అంగవైకల్యం ఆమె ముందు బలాదూరైంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం అని ఈ బసంతి మరోసారి చాటిచెప్పింది. బసంతి ఒకప్పుడు కుటుంబానికి బారంగా మారుతుందేమో అనుకున్నా... కానీ ఆ బసంతి వల్లే ఇప్పుడు మొత్తం కుటుంబం పొట్ట నింపుకుంటోంది. టీచర్ గా తన జీవిత పాఠాన్నే.. పిల్లలకు బోధిస్తోంది బసంతి. ఇలాంటి ఎంతో మంది బసంతిలకు మనసారా చేస్తున్నాం హాట్సాఫ్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  Basanthi  Handicap  

Other Articles