after son death parents commits suicide

Seven year old dies of dengue after that parents commit suicide

Delhi, Suicide, Parents commit suicide, Dendgue

seven year old dies of dengue after that parents commit suicide Delhi government has issued notices to two private hospitals after the parents of a seven-year-old boy, who died of dengue on September 8, jumped to their deaths from a building after they failed to get him admitted to a hospital in time.

ITEMVIDEOS: మా కొడుకు చనిపోయాడు.. మేము కూడా చనిపోతున్నాం

Posted: 09/12/2015 04:39 PM IST
Seven year old dies of dengue after that parents commit suicide

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనారోగ్యంతో మరణించడంతో ఆ దంపతులు కుంగిపోయారు. కొడుకు లేని జీవితం వ్యర్థమనుకున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కొడుకుతో పాటు తాము కూడా తనువు చాలించాలని భావించారు. అంతే... తాము అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని లాగో సరాయ్ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒడిషాకు చెందిన బబిత, లక్ష్మీచంద్ర దంపతులకు ఒక్కడే కొడుకు. పేరు అవినాష్. వయసు ఏడేళ్లు. ఆ బాలుడు డెంగీ జ్వరంతో మరణించాడు. అతడిని కాపాడటానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతే, కన్న కొడుకును ఖననం చేసిన 24 గంటల్లో అతడి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులిద్దరూ చేతులను కట్టేసుకుని భవనం పైనుంచి దూకారు. ఇందులో ఎవరి తప్పూ లేదంటూ ఒరియాలో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బబిత, లక్ష్మీచంద్ర దంపతులు అందరితో కలివిడిగా ఉండేవారని ఇరుగు వారు చెప్పారు. కొడుకంటే వారికి ప్రాణమని, అందుకే అతడి మరణాన్ని తట్టుకోలేక పోయారని చివరకు ఇలా చేసుకున్నారని వాళ్లు బాధపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Suicide  Parents commit suicide  Dendgue  

Other Articles