Congress candidate is Bangalore civic body’s mayor, JD(S) candidate is the deputy mayor

Congress jds coalition wins the bbmp mayor s seat

bangalore mayor, bbmp elections, manjunatha reddy, congress mayor, karnataka high court, shock to bjp in bangalore mayor elections, Bruhat Bengaluru Mahanagara Palike,JD(s) deputy mayor, deputy mayor hemalatha gopalaiah, Home Minister KJ George, mayor elections, deputy mayor elections, Mahalakshmi Layout, JD(S), congress, bjp, Ulsoor, Malleshwaram, Bangalore North, Bangalore South, Bangalore Central, BBMP elections, BN Manjunatha Reddy

Congress candidate BN Manjunatha Reddy who was elected for the third time from Madiwala ward has been elected as the mayor of the Bruhat Bengaluru Mahanagara Palike (BBMP).

అధిక్యం వారిదే కానీ మేయర్ పీఠం మాత్రం వీరిది..? అదెట్టా రామచంద్రా..?

Posted: 09/11/2015 09:54 PM IST
Congress jds coalition wins the bbmp mayor s seat

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ( బిజేపీ)కి షాక్ తగిలింది. బెంగుళూరు మేయర్ ఎన్నికలలో తగిన సంఖ్యలో స్థానాలు గెలిచినా.. మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్ ఎగురేసుకుపోయింది. స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు ఎదురుకావడంతో బీజేపికి దిక్కుతోచని పరిస్థతి ఏర్పడింది. ఇక చేసేది లేక కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పిస్తుంది. బెంగుళూరు మేయర్ ఎన్నికలు సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. కార్పొరేషన్లో మెజారిటీ ఉన్నా.. తమ అభ్యర్థిని మేయర్గా గెలిపించుకోలేక బీజేపీ చతికిలబడింది. సొంత బలం లేకపోయినా, ఎమ్మెల్యేలు.. ఇతరుల బలంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది అయితే కర్ణాటక. హైకోర్టు తుదితీర్పును బట్టే ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎన్ మంజునాథ రెడ్డి మేయర్గాను, జేడీ(ఎస్)కు చెందిన హేమలతా గోపాలయ్య డిప్యూటీ మేయర్గాను ఎన్నికయ్యారు.

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక్కడ మొత్తం 198 వార్డులు ఉండగా వాటిలో 100 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్కు 76, జేడీ (ఎస్)కు 14 స్థానాలు దక్కగా ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఎమ్మెల్యేలు, ఇతరుల బలంతో కలిపి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మంజునాథరెడ్డికి 131 ఓట్లు వచ్చాయి. అయితే.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన తుది నిర్ణయం కర్ణాటక హైకోర్టు నుంచి వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సవాలు చేస్తూ ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారు. మేయర్, డిప్యూటీమేయర్లుగా ఎన్నుకోవాలంటే 131 మంది సభ్యులు కావల్సి ఉంటుంది. బీబీఎంపీ మండలిలో మొత్తం 260 మందికి ఓటుహక్కు ఉంది. వాళ్లలో 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఈ ఓట్లు కలిపితేనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. దాంతో మేయర్గా తమ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోగలిగింది. అయితే, ఇలా ఎమ్మెల్యేలు తదితరులకు ఓటుహక్కు కల్పించే సెక్షన్ 7, 10లను సవాలుచేస్తూ బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore mayor  bbmp elections  manjunatha reddy  congress mayor  karnataka high court  

Other Articles