Accident in Makka Masjid

Crane crashes at makkas grand masjid

Makkas Grand Masjid, Makka Masjid, 107dead, Soudi Arebia, Haj

Crane crashes at Makkas Grand Masjid A crane crash at the Grand Masjid in Makkah left as many as 107 dead and 184 injured . According to SahilOnline correspondent Yahya Hallare who was praying in the same masjid during the accident, strong winds caused the crash.

ITEMVIDEOS: మక్కాలో ప్రమాదం.. 107 మంది మృతి

Posted: 09/12/2015 07:55 AM IST
Crane crashes at makkas grand masjid

మక్కా పవిత్ర హజ్‌ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. భక్తులు హజ్‌ క్రతువుల్లో ఉండగా.. భారీ క్రేన్‌ కూలింది. ఈ దుర్ఘటనలో107 మంది మరణించారు. 184మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్‌ కూలి మసీదు పైకప్పుపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్‌ క్రతువుల్లో, అల్లాహ్‌ నామస్మరణలో భక్తులు లీనమై ఉన్నవేళ.. అంతటా భక్తి పారవశ్యం.. ఆథ్యాత్మిక పరిమళాల్లో ప్రార్ధనలు చేస్తున్న వేళ...సడెన్‌గా భారీ శబ్దం, ఘోర ప్రమాదం, పెను విషాదం.. భక్తుల హాహాకారాలు..ఎప్పటిలాగే, ఈ ఏడు కూడా పవిత్ర హజ్‌ యాత్రకు లక్షలాదిగా తరలివచ్చారు భక్తులు. ఎటు చూసినా భక్తజనం. అల్లాహ్‌ కీర్తనలు, పవిత్ర వాక్యాల పారాయణం.. నమాజులు, ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో.. పెను విషాదం చోటుచేసుకుంది.

ఏటా పెరుగుతున్న హజ్‌ యాత్రికుల్ని దృష్టిలో పెట్టుకొని మక్కా మసీదు విస్తరణ పనుల్ని చేపడుతోంది సౌదీ ప్రభుత్వం. 24 గంటలూ భారీ యంత్రాలు, మిషనరీతో పనులు జరుగుతున్నాయక్కడ. ప్రధాన మసీదు ఏరియాలో భారీ క్రేన్‌ల సహాయంతో నిర్మాణం సాగుతోంది. ఆ టైమ్‌లోనే ఓ జెయింట్ క్రేన్ ఒక్కసారిగా మసీదు పైకప్పుపై కూలిపడింది. ఆ పైకప్పుకింద ఉన్న భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు నాలుగొందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ టీమ్‌ రంగంలోకి దిగింది. మక్కాలో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ఏరియాను తమ అధీనంలోకి తీసుకున్నాయి బలగాలు. ఈ ప్రమాదంలో హజ్‌ యాత్రికులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఆయా దేశాల ప్రతినిధులు, రాయబారులు తమవాళ్ల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సౌదీలోని ఇండియన్‌ ఎంబసీకి చెందిన ఉన్నతాధికారులు సౌదీ అధికారులతో మాట్లాడుతున్నారు. మృతుల్లో భారత్‌కు చెందినవాళ్లెవరైనా ఉన్నారా?, గాయపడిన వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ల పరిస్థితెలా వుందో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Makkas Grand Masjid  Makka Masjid  107dead  Soudi Arebia  Haj  

Other Articles