ms dhoni approaches supreme court quashing criminal case against him

Ms dhoni moves to supreme court over lord vishnu row

Cricket MS Dhoni Approaches Supreme Court in Quashing Criminal Case Against Him latest Cricket news, team india, cricketer, supreme court, lord vishnu, Indian Cricket, MS Dhoni, Cricket

MS Dhoni has approached the Supreme Court seeking quashing of criminal case against him pertaining publication of his photo portraying him as Lord Vishnu in a business magazine after the Karnataka High Court declined to quash the criminal proceedings

గాడ్ ఆఫ్ గుడ్ డీల్స్ తెచ్చిన తంటా.. సుప్రీంకోర్టును అశ్రయించిన ధోని

Posted: 09/10/2015 09:37 PM IST
Ms dhoni moves to supreme court over lord vishnu row

ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే టీమిండియా క్రికెట్ కెప్టెన్ ధోని విష్ణువు రూపంలో ప్రచురించిన చిత్ర వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయన గురువారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2013లో జరిగిన ఆ ఘటనపై ఆయన అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూర్ అదనపు చఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీండింగ్స్‌ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహేంద్ర సింగ్ ధోని పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెల 14వ తేదీన విచారించనున్నట్లు తెలిపింది. తనపై గల క్రిమినల్ కేసును కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించడంతో హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  team india  cricketer  supreme court  lord vishnu  Indian Cricket  MS Dhoni  Cricket  

Other Articles