T Govt on farmer suicide

Telangana govt gave clarity on farmer suicide

Telangana, Suicide, farmer, Hyderabad, KCR, Limbiah, Nizamabad

Telangana govt gave clarity on farmer suicide. Limbiah, a farmer suicide in hyderabad. Media publish several articles on farmer suicide.

ఆ రైతు ఆత్మహత్యకు... అప్పులు కాదు అనారోగ్యం కారణం

Posted: 09/11/2015 12:41 PM IST
Telangana govt gave clarity on farmer suicide

తెలంగాణలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద మీడియా వస్తున్న వరుస కథనాలతొ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ లో, అది కూడా సచివాలయానికి దగ్గరలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం మీద మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఎంక్వైరీ చేసింది. చైనా పర్యటనలో ఉన్న కేసీఆర్ సైతం రైతు ఆత్మహత్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింబయ్య ఆత్మహత్య అన్ని వివరాలు సేకరించింది ప్రభుత్వం. పంటనష్టం వల్ల కాకుండా.. అనారోగ్య కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రాధమిక నివేదికను సర్కారుకిచ్చారు అధికారులు.

రుణాలు లభించక, పంటలు ఎండిపోయి, అప్పుల భారం పెరిగిపోయి..తీవ్ర మనోవ్యథకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నదాతలు. రాజధానిలో సచివాలయం సమీపంలో రైతు లింబయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది సర్కార్. ఈ ఘటనపై చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్...వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులను నివేదిక కోరారు. దీంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహంచారు. లింబయ్య ఆత్మహత్యపై... ఆయన గ్రామం నుంచి వివరాలు తెప్పించుకున్నారు.

లింబయ్య స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా రామరెడ్డి గ్రామంలో అధికారులు విచారణ జరిపారు. లింబయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడలేదని, అనారోగ్యం వల్లనే మృతిచెందాడని పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. లింబయ్య దంపతులకు ఆసరా ఫించన్ కింద నెలకు 2 వేలు అందుతున్నట్లు అధికారులు నిర్థారించారు. ఇదే విషయాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపర్చి ప్రభుత్వానికి పంపారు. లింబయ్య అనారోగ్యంతో మృతి చెందితే...అప్పుల భారంతో మృతిచెందినట్లుగా వార్తలు వచ్చాయని భావించిన కేసీఆర్...ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతు బలవన్మరణానికి పాల్పడకుండా నివారించేందుకు, వారిలో మనోధైర్యం నింపే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైతన్నలు ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. పంట రుణాల వడ్డీ విషయంలో కూడా బ్యాంకులను మందలించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Suicide  farmer  Hyderabad  KCR  Limbiah  Nizamabad  

Other Articles