petrol costs at 190 in Manipur

Petrol being sold at rs 190 per l in manipur

Petrol, Manipur, 190rs, Petrol Price, Dimapur Highway

petrol being sold at Rs 190 per L in Manipur. Manipur, already struggling with a long agitation over the implementation of Inner Line Permit (ILP) system, has now been hit by a steep rise in the prices of essential items.

లీటర్ పెట్రోల్ ధర 190.. మన ఇండియాలోనే

Posted: 09/09/2015 09:53 AM IST
Petrol being sold at rs 190 per l in manipur

ఉల్లి పాయల ధరలు సెంచరీ దాటింది. ఇక పప్పు దినుసుల సంగతి చెప్పక్కర్లేదు. ఇదే జాబితాలో తాజాగా పెట్రోల్ కూడా చేరింది. లీటర్ పెట్రోల్ ధర 160 నుండి 190 వరకు ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పెట్రోల్ ధర అంతలా మన దగ్గరలేదు..మణిపూర్ లో. అవును మణిపూర్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర 160 నుండి 190 వరకు పలుకుతోంది. అది కూడా ఆరు ఏడు గంటలు ఆగి.. లైన్ లో నిల్చుంటేనే దొరుకుతుంది లేదంటే గోవిందే. అసలు మణిపూర్ లో ఇంత దారుణంగా పరిస్థితి మారడానికి కారణాలు ఏంటో తెలుసా..? అక్కడ కొంత కాలంగా జరుగుతున్న అల్లర్ల కారణంగాన అక్కడ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇంపాల్-ధీమాపూర్, ఇంపాల్ -సిల్చార్ హైవేల మీద వచ్చీపోయే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అక్కడ జరుగుతున్న ఆందోళన గురించి తెలియక భారీ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దొరికిందే ఛాన్స్ గా హైవేల మీద పెట్రోల్ ధరలకు రెక్కలు వచ్చేశాయి. దాంతో వంద.. నూటయాభై రూపాయలు అలా ఏకంగా నూటాతొంభై రూపాయల వరకు చేరింది. దాంతో హైవేల మీద అమ్మడానికి పెట్రోల్ బంక్ ల యజమానులు ఆసక్తి చూపుతుండటంతో సామాన్యులను, పెట్రోల్ దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ఏడు ఎనిమిది గంటలపాటు లైన్ లో నిల్చుంటే కానీ అర లీటర్ పెట్రోల్ దొరికేట్లు కనిపించడం లేదు. అయితే దీని మీద అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్ అందరికి అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Manipur  190rs  Petrol Price  Dimapur Highway  

Other Articles