Lio Group Company Of China Interested To Invest 1000 Crores In Telangana | Kcr China Tour | Kcr Succes

Cm kcr china tour 1000 crores investments telangana state lio group company

kcr china tour, lio group company, china lio group company, china software companies, kcr meetings, kcr updates, kcr in china airport, kcr controversies, kcr latest news

CM Kcr China Tour 1000 Crores Investments Telangana State Lio Group Company : After Meeting With CM KCR.. Lio Group Company Of China Interested To Invest 1000 Crores In Telangana.

తొలిరోజే కేసీఆర్ దూకుడు.. జేజేలు కొట్టిన ‘డ్రాగన్’ కంట్రీ

Posted: 09/09/2015 10:08 AM IST
Cm kcr china tour 1000 crores investments telangana state lio group company

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఓ విషయంలో పట్టుబిగిస్తే దాన్ని సాధించేవరకు వదలరు. ఎన్ని అడ్డంకులు, విమర్శలు తనమీదికొచ్చినప్పటికీ.. తన పంథా తాను సాధించడంలో ఎన్నడూ వెనుకాడరు. ఇలా ఆయన ఎన్నోసార్లు చేసి నిరూపించారు కూడా. ఇప్పుడు మరోసారి తన సత్తాను ‘డ్రాగన్’ గడ్డపై చేసి చూపించడంతో ఆయనపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఇంతకీ ఆయన చేసిందేంటి? అను అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

కేసీఆర్ తన 19 మంది ప్రతినిధుల భారీ బృందంతో మొన్న హైదరాబాదు నుంచి చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే! కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా చైనా గడ్డపై అడుగుపెట్టిన ఆయన.. అక్కడ చేరుకోగానే వెంటనే రంగంలోకి తొలిరోజే మెరుగైన ఫలితాన్ని రాబట్టారు. చైనాలోని డేలియన్ నగరంలో పారిశ్రామిక వేత్తలతో జరిగిన భేటీలో.. ఆయన ఏకంగా రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులను రాబట్టగలిగారు. ఆ భేజీ సందర్భంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనలకు చైనా కంపెనీ ‘లియో గ్రూపు’ ముచ్చటపడింది. దాంతో ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. డ్యూటీ పంపుల తయారీలో వున్న లియో గ్రూపు.. రాష్ట్రంలో కొత్త యూనిట్ ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచింది. ఏదేమైనా.. ఇది కేసీఆర్ చరిష్మా కారణంగానే సాధ్యమైందని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు.. ఆ భేటీలో భాగంగానే లియో గ్రూపుతోపాటు మరో 30 పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఒకవేళ వీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. భారీస్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు.. కేసీఆర్ చైనాలో మరిన్ని సంస్థలతో భేజీ జరిపి.. ఇతర సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr china tour  lio group company china  telangana state  

Other Articles