Albert Einstein | Lydia Sebastian | Stephen Hawking | IQ

12 year old indian origin girl has higher iq than albert einstein

Albert Einstein, Lydia Sebastian, Stephen Hawking. IQ, Mensa IQ test, London

12 Year Old Indian Origin Girl has Higher IQ Than Albert Einstein. A 12-year-old Indian-origin girl in the UK has achieved the highest possible score of 162 on a Mensa IQ test, outwitting physicists Albert Einstein and Stephen Hawking. Lydia Sebastian from Essex has joined the one per cent of all entrants to attain the highest mark in the Cattell III B paper supervised by Mensa, the society for people with high IQs.

ఆ అమ్మాయికి ఐన్ స్టీన్ ను మించిన ఐక్యు

Posted: 09/07/2015 10:53 AM IST
12 year old indian origin girl has higher iq than albert einstein

నీ సినిమాకు నువ్వే హీరో అని తెలుగు సినిమాలో డైలాగ్ ఉంది. అలా ఎవరికి వారే హీరోలు అనుకున్నా కానీ నిజమైన హీరోలు మాత్రం తక్కువ మందే ఉంటారు. కానీ లండన్ లో ఉంటున్న ఓ పన్నెండేళ్ల అమ్మడు మాత్రం అందరికి స్టార్ గా కనిపిస్తోంది. ఎందుకు అలా అనుకుంటున్నారా..? అమ్మాయి ఐక్యు ప్రపంచంలో చాలా మందికి మైండ్ బ్లాక్ చేసింది మరి.  ఫిజిక్స్‌లో దిగ్గజాలైన అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ సాధించలేని ఘనతను లండన్‌లోని 12 ఏండ్ల భారత సంతతికి చెందిన అమ్మాయి లిడియా సెబాస్టియన్ సొంతం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న మెన్సా ఇంటెలిజెన్స్ కోషంట్ (ఐక్యూ) టెస్ట్‌లో 162 పాయింట్ల స్కోర్‌ను సాధించి.. సమకాలీన శాస్త్రవేత్తల్ని సైతం ముక్కున వేలేసుకునే ఘనకార్యాన్ని సొంతం చేసుకున్నది. ఇలాంటి పరీక్షలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, హాకింగ్ 160 పాయింట్లే స్కోర్ చేయడం గమనార్హం. లండన్‌లోని బ్రిర్క్‌బెక్ కాలేజీలో నిర్వహించిన ఈ టెస్ట్‌ను గడువు సమయం కంటే కొన్ని నిమిషాల ముందుగానే పూర్తి చేయడం లిడియా ప్రతిభా పాటవాలకు నిదర్శనం.

హ్యారీ పోటర్‌కు సంబంధించిన ఏడు ఎడిషన్ల పుస్తకాలను మూడేసి సార్లు చదివేసిందట లిడియా సెబాస్టియన్. నాలుగేళ్లలో వయసులోనే వయోలిన్ వాయిద్యాన్ని వాయించడంలో నేర్చుకుంది. ఆరునెలల్లోనే స్పష్టంగా మాట్లడటం నేర్చుకుంది అని తండ్రి అరుణ్ సెబాస్టియన్ వివరించారు. ముందు కొంత సేపు ఉద్వేగానికి లోనయ్యానని. ఒకసారి టెస్ట్ ప్రారంభించిన తర్వాత అనుకున్న దానికంటే సులభంగా అనిపించిందని. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా పరీక్షను ముగించానని లిడియా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Albert Einstein  Lydia Sebastian  Stephen Hawking. IQ  Mensa IQ test  London  

Other Articles