Modi Sarkar Increase Funds To Telugu States By Pradhan Mantri Gram Sadak Yojana Scheme | Venkaiah Naidu Updates

Modi sarkar increase funds telugu states pradhan mantri gram sadak yojana scheme venkaiah naidu

modi sarkar, Pradhan Mantri Gram Sadak Yojana, venkaiah naidu, telugu states funds, bjp funds to telugu states, bjp government, venkaiah naidu updates, telugu states controversy

Modi Sarkar Increase Funds Telugu States Pradhan Mantri Gram Sadak Yojana Scheme Venkaiah Naidu : Modi Sarkar Increase Funds To Telugu States By Pradhan Mantri Gram Sadak Yojana Scheme.

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ‘నిధుల వర్షం’

Posted: 09/07/2015 10:36 AM IST
Modi sarkar increase funds telugu states pradhan mantri gram sadak yojana scheme venkaiah naidu

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం (పీఎంఎస్జీవై) కింద రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నిధులను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఏపీకి రూ. 167 కోట్ల వాటా ఉండగా, ఇఫ్పుడు దాన్ని రూ. 208.70 కోట్లకు పెంచింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రూ. 122 కోట్ల నిధుల వాటా ఉండగా, దాన్ని రూ. 159.20 కోట్లు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దీంతో ఏపీకి రూ. 41 కోట్లు, టీఎస్ కు రూ. 37 కోట్ల మేరకు నిధులు పెరిగినట్లయింది.

ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు పెంచడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ఈ నిధులతో పల్లెల్లో విద్య, వైద్యం, సామాజిక సంబంధాలు, సేవలు విస్తృతమవుతాయని ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద ఇతర రాష్ట్రాలకు నిధులు అమలవుతాయన్న విషయం తెలిసిందే! అయితే.. ఇతర రాష్ట్రాల నిధుల వాటాను ప్రభుత్వం పెంచిన విషయం ఇంకా స్పష్టం అవలేదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు పెంచిన విషయాన్ని ధృవీకరించింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. మరిన్ని పథకాల పేరిట రెండు రాష్ట్రాలకు ఇంకా నిధులు అందే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi sarkar  Pradhan Mantri Gram Sadak Yojana  telugu states funds  

Other Articles