anti rape bra | Chennai

A private employee invent a new bra for ladies which can prevent rape

Bra, Chennai, Manisha Mohan, Rape, Protection From Rape, New Bra

A private Employee invent a new bra for ladies which can prevent rape. Manisha Mohan who working in mit Media labs in America, Discover new bra for ladies protection.

రేప్ చెయ్యాలనుకుంటే షాక్ కొడుతుంది

Posted: 08/27/2015 03:49 PM IST
A private employee invent a new bra for ladies which can prevent rape

చూడడానికి సన్నగా ఉన్నా ఉంటది కానీ ముట్టుకుంటే షాకే సాలిడ్ గా ఉంటుంది. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. తాజాగా ఇలాంటి షాక్ ఇచ్చే ఓ బ్రాను తయారుచేసింది చెన్నైకి చెందిన ఓ మహిళ. అదేంటి షాక్ కొట్టడం ఏంటీ అని షాక్ అవుతున్నారా..? ఇది నిజం. ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మీడియాలో చూస్తూనే ఉన్నాం.. నిర్భయ దగ్గరి నుండి నిన్నటి దాకా ఆడవాళ్ల మీద అత్యాచారానికి ఒడిగట్టిన దుర్ఘటనలే. అయితే వీటికి కళ్లెం వెయ్యడానికి ఓ యువతి చేసిన అద్భుతమైన ఆలోచనే.. ఈ షాక్ ఇచ్చే బ్రా. మొత్తానికి నిన్నటి దాకా ఆడవాళ్లను రక్షణ కోసం పెప్పర్ స్ర్పేలు, అవీ ఇవీ అంటూ ఏవేవో ప్రోడక్ట్ లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇక మీదట కరెంట్ షాక్ ఇచ్చే బ్రాలు అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.

మహిళలు ధరించే ‘బ్రా’నే వారికి సహాయపడేలా నూతన కవచాన్ని తయారుచేసింది అమెరికాలో మిట్‌ మీడియా ల్యాబ్‌లో చదువుతున్న మనీషా మోహన్‌. ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన వారికి 3,800 కిలోవాట్ల విద్యుత్‌ షాక్‌ కొడుతుంది. అంతేకాదు.. ఇందులో అమర్చిన జీపీఎస్‌ సహాయంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక సందేశం పంపే వ్యవస్థ కూడా ఉంది. ఇటీవలే ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు దీని పనితీరును ప్రదర్శించి ఆయన ప్రశంసలు కూడా పొందింది. వర్సిటీ అందించిన చేయూతతో స్వీడన్‌లో సెమిస్టర్‌ అభ్యసించే అవకాశం కలిగిందని, అలా వెళ్లడమే సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందని మనీషా తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bra  Chennai  Manisha Mohan  Rape  Protection From Rape  New Bra  

Other Articles