Cops Rampage During Patel Agitation

Gujarat cops rampage during patel agitation caught on cctv

hardik patel, Patel, Gujarat, Rampage, Cops, CCTV

Gujarat Cops Rampage During Patel Agitation Caught on CCTV Gujarat policemen are seen destroying public property and smashing car windows in CCTV footage that has emerged from a residential area in Ahmedabad. The visuals, from the night of August 25, show the policemen, wearing helmets, breaking into the Shahibaug area and going on the rampage.

ITEMVIDEOS: పోలీసులే రౌడీలుగా మారారు.. నాశనం చేశారు

Posted: 08/27/2015 03:35 PM IST
Gujarat cops rampage during patel agitation caught on cctv

పోలీసు గుండా.. గుండా పోలీసులు అంటూ సినిమాల్లో రకరకాల పాత్రల గురించి విని ఉంటాం. పోలీసులే కానీ రౌడీల్లాలా మారి రౌడీల భరతం పడితే అందరం విజిల్స్ వేసి చప్పట్లు కొడతాం.. మరి అదే మాదిరిగా నిజ జీవితంలో పోలీసులు రౌడీలుగా మారితే ఎలా ఉంటుంది. కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేస్తే ఎలా ఉంటుంది.. కారు అద్దాలతో పెద్ద పెద్ద రాల్లతో ధ్వసం చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇదే సీన్ రియల్ గా జరిగింది. పోలీసులు రౌడీలలా రాళ్లు, రాడ్ లు, పెద్ద పెద్ద కర్రలు పట్టి వీరంగం సృష్టించారు. కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేశారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా వస్తువులను నాశనం చెయ్యడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చెయ్యడం సర్వాత్రా చర్చకు తెర తీసింది. సీసీటివీ పుటేజి పోలీసుల తీరును ఆధారాలతో సహా బయటపుట్టేశాయి. అయినా ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? గుజరాత్ లో. అవును నరేంద్ర మోదీ గారి సొంతం రాష్ట్రం గుజరాత్ లోనే జరిగింది.

 



గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గం.. తమకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలని గత మూడు నాలుగు రోజుల నుండి తమ ఆందోళనలను మరింత ఉదృతం చేశారు. అయితే నిన్న గుజరాత్ బంద్ కు పిలుపునివ్వడం.. బంద్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం జరిగిపోయాయి. అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు హింసాత్మక ఘటనలు ఎక్కడ జరిగాయి.. ఎలా జరిగాయి అన్న దాని మీద మార్దిక్ పటేల్ అనుచరులు పటేల్ కోటా వార్ అనే పేరుతో ట్విట్టర్ లో ఓ పేజీని క్రియేట్ చేసి.. దానిలో ఓ వీడియోను ఉంచారు. ఆ వీడియోలో పోలీసులు ఆస్తులను ధ్వంసం చెయ్యడం కనిపించింది. అయితే పోలీసులు రౌడీల్లా మారి విధ్వంసాన్ని సృష్టించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా చేశారు..? ఎవరి కోసం ఇలా చేశారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

*అబినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  Patel  Gujarat  Rampage  Cops  CCTV  

Other Articles