Patel Reservation | hardik patel | Modi

Modi got headache on the patel protest

Patel, Reservation, hardik patel, Modi, Gujarat, Patels Protest

Modi got Headache on the patel Protest. Yester days Patels call for Gujarat Bundh took violence face. Modi calls for peace but patel group didnt care.

మోదీకి తలనొప్పిగా మారిన పటేల్ పోరాటం

Posted: 08/27/2015 08:41 AM IST
Modi got headache on the patel protest

గుజరాత్‌ రావణకాష్టంలా మండుతోంది. రిజర్వేషన్ల కోసం పటేళ్లు సాగిస్తున్న పోరాటం... హింసకు దారితీయడం తీవ్ర కలకలం రేపింది. అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శాంతి భద్రతలు అదుపు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. పటేళ్ల సామాజిక వర్గానికి OBC కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో మొదలైన ఈ ఉద్యమం... అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. రాజ్‌కోట్‌, సూరత్, అహ్మదాబాద్‌తో పాటు ప్రధాన పట్టాణాల్లో ఆందోళన కారులు రెచ్చిపోయారు. బస్సుల్ని, కార్లను అడ్డుకుని తగలబెట్టారు. బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసి, నిప్పుపెట్టారు.

నిరసనకారుల విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల తీవ్ర స్థాయిలో లాఠీ చార్జీ జరిగింది. పదుల సంఖ్యలో జనానికి గాయాలయ్యాయి. పరిస్థితుల్ని కంట్రోల్‌ చేయడానికి భారీగా బలగాల్ని రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు. కొన్నిచోట్ల కర్ఫ్యూ, 144 సెక్షన్‌ను విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా కన్పించడం లేదు. మరోవైపు లాఠీ ఛార్జి చేయమని తాను పోలీసులకు ఆదేశించలేదని సీఎం ఆనందిబెన్ పటేల్ చెబుతున్నారు. ప్రభుత్వమే లాఠీ ఛార్జికి ఆదేశించిందన్న వ్యాఖ్యలను ఆమె కొట్టిపడేశారు.

సుప్రీంకోర్టు తీర్పుల దృష్ట్యా పటేల్ వర్గీయులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని గుజరాత్ సీఎం చెప్పడంతో ఈ ఉద్యమం తీవ్రంగా మారింది. తమను వెనుకబడిన కులాల్లో చేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తామని... పటేళ్ల నాయకుడు, 22 ఏళ్ల కుర్రాడు హార్ధిక్ పటేల్ హెచ్చరించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు దక్కేవరకు తమ పోరాటం ఆగదన్నాడు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గుజరాత్‌లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న పటేల్ కులస్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. పటేళ్లకు రిజర్వేషన్ల కోసం వారితో కలిసి తామూ పోరాటం చేస్తామని లాలూ ప్రకటించారు.అయితే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఇలా ఓ వర్గం వారు చేస్తున్న పోరాటం హింసాత్మకంగా మారడం తలనొప్పిగా మారింది. చర్చల ప్రక్రియ ద్వారా సమస్యలను అదిగమించవచ్చు అని మోదీ ప్రత్యేకంగా శాంతి సందేశాన్ని వినిపించినా కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patel  Reservation  hardik patel  Modi  Gujarat  Patels Protest  

Other Articles