Special package for Bihar | Modi | Bihar Elections

That state cheif minister abuse pm modi for his special gift

Bihar, Nitesh Kumar, Special package, Modi, Bihar Elections

That state Cheif Minister abuse Pm MOdi for his special gift. Modi gifted special package for the state of Bihar, But the Bihar cm Nitesh Kumar commented on Modi and his special packaage.

గిఫ్ట్ ఇచ్చినా మోదీని తిట్టిన ముఖ్యమంత్రి

Posted: 08/27/2015 08:42 AM IST
That state cheif minister abuse pm modi for his special gift

ప్రధాని నరేంద్ర మోదీ ఓ రాష్ట్రానికి బంపర్ ఆఫర్  ఇచ్చారు.. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం దాని మీద పెదవి విరుస్తున్నారు. గిఫ్ట్ ఇచ్చినందుకు ధ్యాంక్యు అనాల్సింది పోయి నోటినిండా తిడుతున్నారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా..? ఇంకెవరు నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రానికి మోదీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ గురించి నితీష్ కుమార్ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ బీహార్‌కు ప్రకటించిన 1.25 లక్షల కోట్ల ప్యాకేజి కేవలం 'రాజకీయ ప్యాకేజి' మాత్రమేనని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలో కేవలం 10,868 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అదనంగా లభించిన నిధులని, మిగిలినవన్నీ పాత ప్రాజెక్టులకు సంబంధించినవేనని వివరించారు. ప్రధాని బీహార్‌కు ప్రకటించిన 'ప్రత్యేక' ప్యాకేజిలో ఎటువంటి ప్రత్యేకత లేదన్నారు. రోడ్లు, విద్యుత్‌, రైల్వేల వంటి రంగాలలో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను వివరాలను వెల్లడిస్తూ 'అత్యున్నత స్థానంలో వున్న వ్యక్తి బీహార్‌ ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా వెక్కిరిస్తున్నార'ని ప్రశ్నించారు.

కేంద్రం ప్రకటించిన స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాల నుండి బీహార్‌ను ఎందుకు మినహాయించారు? బీహార్‌ భారత్‌లో భాగం కాదా? దీనిలో ప్రత్యేకత ఏమిటని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలదీశారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజి వెనుక వాస్తవాలను ప్రజలకు వివరించటం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందుంచుతున్నానని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు. ఒకవేళ దేశ జిడిపిలో 1 శాతం మేర వున్న ఇంత భారీ ప్యాకేజిని బీహార్‌కు ఇస్తే దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా ఎందుకు వెలువడలేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల సమయం కనుక బీహార్‌ ప్రజలను మాయ చేసేందుకే ప్రధాని స్పెషల్‌ ప్యాకేజ్‌ అంటూ ప్రకటించారని, ఇది రాజకీయ ప్యాకేజ్‌ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. గుజరాత్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆయన ప్రస్తావిస్తూ బీహార్‌ రాత మార్చటానికి బదులు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూసుకోవాలని ప్రధానికి చురకలంటించారు. గుజరాత్‌ రిజర్వేషన్‌ ఉద్యమానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్న నితీష్‌ వారికి రిజర్వేషన్‌ అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే తరువాతైనా వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitesh Kumar  Special package  Modi  Bihar Elections  

Other Articles