Dawood | Mumbai | IB | Kill Dawood

Mumbai cops put paid to kill dawood plan in 2005

Dawood, Mumbai, IB, Kill Dawood, Pakistan, RK Singh, Operation, ISI, Karachi

Mumbai cops put paid to kill Dawood plan in 2005 In a significant disclosure, former Union home secretary R K Singh has said that Indian intelligence agencies had to abort a covert operation they had planned to take out fugitive underworld don and mastermind of Mumbai serial blasts Dawood Ibrahim.

దావూద్ చచ్చి పదేళ్లయ్యేది.. జస్ట్ మిస్

Posted: 08/25/2015 10:43 AM IST
Mumbai cops put paid to kill dawood plan in 2005

ముంబై నగరాన్ని, చీకటి సామ్రాజాన్ని తన కంటి చూపుతో శాసించే సత్తా ఉన్నా అండర్ వరల్డ్ డాన్, మకుటం లేని చీకటి లోకానికి రారాజు దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారుండరు. ఒక్క భారత్ మాత్రమే కాదు చాలా దేశాలు దావూద్ పేరును హిట్ లిస్ట్ లో పెట్టాయి. అయితే భారతదేశం ఎంతో కాలంగా కాపుకాస్తున్నా కానీ దావూద్ మాత్రం మనకు చిక్కడం లేదు. కానీ దావూద్ తాలూకు విషయాలు తాజాగా వెలులోకి రావడంతో దావూద్ ను పట్టుకోవడానికి, చంపడానికి భారత ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. అయితే కాస్తలో దావూద్ చావు మిస్ అయిందని ఓ నమ్మలేని నిజాన్ని మాజీ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుత బీజీపీ నాయకుడు ఆర్కే సింగ్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు.

దావూద్ ఇబ్రహీంను హతమార్చేందుకు చోటా రాజన్ ముఠాకు చెందిన కొంత మందిని ఎంపిక చేసి మహారాష్ట్ర బయట శిక్షణ కూడా ఇచ్చింది. అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ డోవెల్ ఐబీ డెరైక్టర్‌గా పనిచేసినప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారు. అయితే దావూద్ ఇబ్రహీం డీ కంపెనీతో సంబంధాలున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు డబ్బుకు అమ్ముడుబోయి ఈ వ్యూహాన్ని వమ్ము చేశారు. కోవర్ట్ ఆపరేషన్ కోసం శిక్షణ పొందుతున్న చోటా రాజన్ ముఠా సభ్యులపై అరెస్టు వారెంట్లు  తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు.

మొత్తానికి కిల్ దావూద్ పేరుతో జరిగిన సీక్రెట్ ఆపరేషన్ ఓ దశలో దావూద్ ఇబ్రహీం చావు వార్తను తెస్తుందని అనుకున్నా కానీ కొన్ని లోపాల వల్ల విఫలమైంది. అయితే ప్రభుత్వాలు దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా.. కొంత మంది అధికారుల కారణంగా మొత్తం ఆపరేషన్ నీరుగారిపోయింది. ఒకవేళ అంతా అనుకున్నట్లయితే దావూద్ చనిపోయి నేటికి పది సంవత్సరాలు గడిచిపోయేది. నేటికి కూడా దావూద్ పాకిస్థాన్ లో అక్కడి ప్రభుత్వ రక్షణలో విలాసవంతంగా బుతుకున్నట్లు తాజాగా వెల్లడైంది. కానీ భారత చట్టాల చేతికి దొరకకుండా ఇప్పటికీ దావూద్ దాక్కుంటూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood  Mumbai  IB  Kill Dawood  Pakistan  RK Singh  Operation  ISI  Karachi  

Other Articles