YSRCongress | Bosta | Vijayanagaram

Ysr cp party facing group clashes in the vijayanagaram dist

YSRCP, YSRCongress, Bosta, Vijayanagaram, Bosta Satyanarayana

YSR CP party facing group clashes in the Vijayanagaram Dist. After joining of Bosta Satyanarayana the seniors in the party was neglected.

వైయస్ఆర్ కాంగ్రెస్.. గ్రూప్ వన్, గ్రూప్ టు

Posted: 08/22/2015 01:28 PM IST
Ysr cp party facing group clashes in the vijayanagaram dist

జనాలెక్కువైతే మజ్జిగ పల్చనవుతుందని సామెత. ఇది అక్షరాల నిజం. జనాల సంఖ్య పెరిగిన కొద్దీ కొత్త తలనొప్పులు వస్తూనే ఉంటాయి. తాజాగా వైసీపీలో కూడా అదే జరుగతోంది. వైసీపీలో పాత వాళ్ల కన్నా కొత్త వాళ్ల సంఖ్య పెరుగతుండటంతో పరిస్థితి మారుతోంది. బొత్స చేరిక తరువాత తొలిసారి నిర్వహించిన విజయనగరంజిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం వర్గపోరుకు వేదికైంది..బొత్స, కోలగట్ల వర్గీయుల పోటాపోటీ నినాదాలతో సమావేశ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఇరు పక్షాల నాయకులు కార్యకర్తలను సముదాయించడంతో పరిస్థితి సర్ధుకుంది. విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బొత్స చేరిక తర్వాత పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ వర్గపోరుకు మళ్లీ వేదికైంది విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు నాయకులంతా స్టేజీ మీదకి వెళ్తుండగానే అలజడి మొదలైంది. కోలగట్ల వీరభద్రస్వామికి జై అంటూ ఆయన వర్గీయులు, బొత్స నాయకత్వం వర్దిల్లాలి అంటూ బొత్స అనుచరులు నినదించారు. పోటాపోటీ నినాదాలతోసమావేశ ప్రాంగణం కొద్ది సేపు దద్ధరిల్లింది. అరుపులు కేకలతో మార్మోగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఇరు వర్గాల వారిని వారించే ప్రయత్నం చేశారు. నాయకులు ప్రధానం కాదని, అందరూ జగన్ జై అనాలని సూచించారు. దీంతో సభాప్రాంగణం శాంతించింది. ఏ పార్టీలోనైనా బేధాభిప్రాయాలు సహజమని, అంతిమంగా పార్టీ నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలన్నారు పార్టీ ఇన్ చార్జ్ ధర్మాన కృష్ణ దాస్ . ఈ నెల 29 జరిగే రాష్ట్ర బంద్ విజయవంతం చేసి, పార్టీ సత్తా చూపాలన్నారు. బొత్స చేరిన తరువాత జరిగిన పార్టీ తొలి సమావేశంలోనే వర్గ విభేదాలు ప్రస్పుటంగా కనిపించాయి. కలిసికట్టుగా సాగాలని నేతలు సూచించినా అది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అసలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం మీద దాడికి దిగాల్సింది పోయి తమలో తామే కుమ్ములాటలకు తెర తీస్తే మాత్రం వైసీపీ పని గోవిందే అంటున్నారు విశ్లేషకులు. మరి వైయస్ జగన్ దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  YSRCongress  Bosta  Vijayanagaram  Bosta Satyanarayana  

Other Articles