AP | Special status | Special package

Which one is better for ap either special package or special status

AP, Special status, Special package, Modi, NDA, funds, Modi, Chandrababu Naidu

Which one is better for ap either special package or special status. NDA govt moves to allot special status or special package.

ప్రత్యేక హోదానా...? ప్యాకేజీనా..? ఏది బెటర్!

Posted: 08/22/2015 11:06 AM IST
Which one is better for ap either special package or special status

ప్రత్యేక పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేందుకు అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ది లేదు కాబట్టి ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తు కేంద్రం వారి అభివృద్దికి సహకరిస్తోంది. అయితే తాజాగా రెండు పదాల మీద తీవ్ర చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదా అయితే మంచిదా..? లేదంటే ప్రత్యేక ప్యాకేజీ అయితే మంచిదా అన్న దాని మీద చర్చలు సాగుతున్నాయి. అసలు రెండింటికి తేడా ఏంటి..? రెండింటి వల్ల అభివృద్ది ఎంత వరకు జరుగుతుంది. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తారా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రాకేజీ ప్రకటిస్తారా..? మొత్తం మ్యాటర్ మీద తెలుగు విశేష్ అనాలసిస్ మీ కోసం

ప్రత్యేక ప్యాకేజీ అంటే..
ఏ రాష్ట్రమైనా అభివృద్దిలో వెనుకబడి ఉంటే, కనీస మౌలిక వసతులు కూడా లేకుండా అక్కడి వారి సగటు ఆదాయం చాలా తక్కువగా ఉంటే అక్కడి పరిస్థితి మార్చేందుకు కొన్ని కండీషన్స్ తో లేదా ఎలాంటి కండీషన్స్ లేకుండా కేంద్రం ప్రకటించే ప్యాకేజీనే ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో కేంద్రం నుండి నిధులు నేరుగా లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి. కేంద్రమే వివిధ ప్రత్యేక కార్యక్రమాలను అక్కడ నిర్వహించడం... ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సరిపోయేలా పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ఆ పథకాల వల్ల అక్కడ అభివృద్దికి పునాది రాయి పడుతుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణీత ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది. అలా వచ్చిన కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించవచ్చు లేదంటే కొత్తగా పథకాలను ప్రవేశపెట్టే అవకాశం కల్పించవచ్చు.

తాజాగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అట్టహాసంగా సినిమా స్టైల్లో ప్రకటించారు. అయితే బీహార్ ఎంతో వెనుకబడి ఉంది అందుకే ప్రత్యేక హోదా కల్పించండి అంటే ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దాని మీద ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించలేదు. కాగా ప్రత్యేక హోదా కల్పిస్తేనే అభివృద్ది చెందుతుంది లేదంటే లేదు అన్నంతలా ఎక్కడా లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద వేగంగా స్పందించడం లేదు. అయితే బీహార్ లో పరిస్థితుల మీద ఎంతో కాలంగా పరిశీలించిన కేంద్రం అందుకు నిరాకరిస్తూ వస్తోంది. అయితే ఇందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. బీహార్ లో ప్రతిసారి అధికారంలోకి వచ్చేది స్థానిక పార్టీలే. కాంగ్రెస్ లేదంటే బిజెపి పార్టీలు ఒకవేళ అదికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అలా జరగలేదు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో ఎంతో కాలంగా వినిపిస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్ మీద కేంద్రం స్పందించింది. ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం వల్ల ఎన్నికల్లో ఓట్లు రాబట్టవచ్చు అని మోదీ ప్లాన్. అందుకే ఎన్నికల సమర శంఖం మోగించిన వెంటనే ప్రత్యేక ప్యాకేజీ మీద ప్రకటన చేశారు. అయితే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తుంటే ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేతులుదుపుకునే ప్రయత్నం చేసింది. దాదాపు మోదీ అందులో విజయం సాధించారు. నితీష్ కుమార్ కు చెక్ పెట్టేందుకే మోదీ హుటాహుటిన బీహార్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేశారు. అయితే తాజాగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఏపికి కూడా ప్రత్యేక ప్యాకేజీనే ప్రకటిస్తారా..? లేదంటే ప్రత్యేక హోదా కల్పిస్తారా ..? అని చర్చ మొదలైంది.

ప్రత్యేక హోదా అంటే...
అభివృద్దికి నోచుకోని రాష్ట్రాలకు కేంద్రం కల్పించే ప్రత్యేక పరిస్థితులకు తగిన గుర్తింపే ప్రత్యేక హోదా. ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం మిగితా రాష్ట్రాలకు భిన్నంగా చూస్తుంది. ఎలాగంటే ఉదాహరణకు జాబ్ వెకెన్సీల్లో అందరూ ఉంటారు. కానీ ఎస్సీ, ఎస్టీల కోసం కొన్ని ఉద్యోగాలు రిజర్వ్ చెయ్యబడి ఉంటాయి. ఆ ఉద్యోగాలను వారికి మాత్రమే కేటాయిస్తారు. అచ్చం అలాగే కేంద్రం రాష్ట్రాలకు కల్పించే కొన్ని సదుపాయాల్లో ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. బీహార్ కు అయినా తాజాగా ఏపికి అయినా ప్రత్యేక హోదా కల్పించడం మీదే చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలి అదొక్కటే మాకు మేలు చేస్తుంది అని ఏపి సర్కార్ కేంద్రానికి నివేదికలు సమర్పిస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని కేంద్రం ముందుంచారు.

ప్రత్యేక హోదా కల్పిస్తే ఏం జరుగతుంది..? అసలు హోదా కోసం అంతలా పాకులాడాల్సిన అవసరం ఉందా..? అంటే ఉంది ఏపికి అన్యాయం జరిగింది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మాల్సిన నిజం. అయితే విభజన చట్టంలో మాత్రం ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని మాత్రం ఎక్కడా నాటి యుపిఎ ప్రభుత్వం పేర్కొనలేదు. అయితే ప్రత్యేక హోదా కల్పిస్తే కలిగే లాభాలు ఏంటి చూడండి..

* ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. దాంతో స్థానికంగా ఉండే వారి్కి ఉపాధి రావడంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది.
* రాష్ట్రంలో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల్లో యాభై శాతం వరకు రాయితీ కింద వస్తుంది.
* పరిశ్రమలు స్థాపించే వారికి 100 శాతం ఎక్పైజ్ డ్యుటి నుండి మినహాయింపు లభిస్తుంది.
* అలాగే పరిశ్రమలను స్థాపించే వాళ్లకు 100 శాతం కార్పోరేట్ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
* రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి 30 శాతం పెట్టుబడి ప్రోత్సాహకాలు,  వర్కింగ్ క్యాపిటల్ రుణాల మీద 3 శాతం వడ్డీ రాయితీ కూడా వర్తిస్తుంది.
* కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లేదా అమలు చేసే పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్ గా ఇస్తుంది. ఒకవేళ ఆ మిగిలిన పది శాతం కూడా భరించలేని పరిస్థితిలో ఉంటే ఆ డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం లోన్ కింద మంజూరు చేస్తుంది.

ఏపికి ఏది బెటర్....?
విడిపోవడ ద్వారా అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ చోటుచేసుకున్నాయి. కానీ ప్రత్యేక హోదా కావాలంటే మౌళిక సదుపాయలు పెద్దగా ఉండకూడదు. ఒకవేళ మౌళిక సదుపాయాలు ఉండి.. అభివృద్ది చెందడానికి అన్ని వనరులు ఉంటే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు. ఏపికి, నాగాలాండ్ కు మధ్యన పోలికలు చూద్దాం. నాగాలాండ్ లో 90 శాతం మంది జనాలు కొండ మీద బ్రతికే కొండజాతి గిరిజనులు. అక్కడికి వెళ్లడానికి కూడా కనీస రోడ్డు సదుపాయం లేకుండా ఉంది. ఎక్కడ చూసినా కొండలు , గుట్టలు ఉండటంతో అక్కడ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా లేదు. అదే ఏపిలో అయితే పరిస్థితి వేరేలా ఉంది. ఇక్కడ 70 మంది జనాలు పట్టణాల్లో లేదంటే పట్టణాలకు దగ్గరలో ఉంటున్నారు. కోస్టల్ కారిడార్ ఏపికి అదనపు బలం. వ్యవసాయ భూములు, అంతులేని వనరులు ఉండటం ఏపికి ప్రత్యేక హోదా కల్పించడానికి దూరం చేస్తున్నాయి. అయితే మొన్నటి దాకా మిగులు బడ్జెట్ కలిగిన ఏపి విభజన తర్వాత లోటు బడ్జెట్ ను పొందింది. సగటు జీవన ఆదాయం కూడా ఏపిలో తగ్గిపోయింది. అందుకే ఏపికి ప్రత్యేక హోదా కల్పించండి అంటూ డిమాండ్ వినిపిస్తోంది.

కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తే పైన చెప్పిన అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలా కాదని ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ మీదకు కేంద్రం వత్తాసు పలికితే కేంద్రం నుండి నిధులు బారీగానే వస్తాయి. అయితే నిధులు రావడం మంచిదే కానీ నిధులు రాష్ట్ర ఖజానాకు చేరి.. అభివృద్ది పనులు చెయ్యవచ్చు. అయితే పరిశ్రమల స్థాపన మాత్రం జరగదు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏపిలో వీలైనన్ని కొత్త కంపెనీలు స్థాపించేదుకు కృషి చేస్తున్నారు. అందుకే ఏపిలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ అన్ని దేశాలు తిరుగుతున్నారు. కానీ దీనికి మరింత ప్రోత్సాహం రావాలంటే మాత్రం కేంద్రం సపోర్ట్ కూడా కావాలి. అందుకే ఏపికి ప్రత్యేక ప్యాకేజీ కన్నా కూడా ప్రత్యేక హోదా అయితే చాలా చాలా బెటర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Special status  Special package  Modi  NDA  funds  Modi  Chandrababu Naidu  

Other Articles