టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్నా అవార్డు సహా అర్జునా అవార్డులను అందుకునే వారి జాబితాను అధికారికంగా ప్రకటించింది. సానియా మిర్చాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందజేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన.. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఖాయమైంది. ఇక బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, షూటింగ్ విభాగంలో నిపుణుడు జీతురాయ్ సహా 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది.
కేంద్ర జాబితాలో అర్జున అవార్డు దక్కిన వారు వీరే..
* రోహిత్ శర్మ -క్రికెట్
* కిదాంబి శ్రీకాంత్ -బ్యాడ్మింటన్
* పీఆర్ శ్రీజేష్ -హాకీ
* దీపా కార్మకర్ -జిమ్నాస్టిక్స్
* జీతురాయ్ -షూటింగ్
* సందీప్ కుమార్ -విలువిద్య
* మన్ దీప్ జంగ్రా -బాక్సింగ్
* బబిత రెజ్లింగ్
* భజరంగీ -రెజ్లింగ్
* స్వర్ణ్ సింగ్ విర్క్ -రోయింగ్
*సతీష్ శివలింగం -వెయిట్ లిఫ్టింగ్
* -యుమ్నమ్ సంతోయి దేవి -పుషు
*శరత్ గైక్వాడ్ -పారా సైలింగ్
* ఎం ఆర్ పూర్వమ్మ -అథ్లెటిక్స్
*మన్జీత్ చిల్లర్ -కబడ్డీ
*అభిలాషా మాత్రే -కబడ్డీ
* అనూప్ కుమార్ యామా -రోలర్ స్కేటింగ్
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more