Saina Nehwal defeats Wang Yihan, aims for first medal in World Badminton Championships

Saina nehwal reaches maiden world badminton championships

Saina Nehwal, Wang Yihan, seimi finals, saina confirms medal, badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal, gutta jwala, ashwini, kashyap, pranoy, kidambi srikanth, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Second seed Saina Nehwal booked a place into the women's singles semifinals after a hard fought win over sixth seed Wang Yihan of China in the World Badminton Championship in Jakarta on Friday

ప్రపంచ చాంపియన్‌షిప్‌ సెమీస్ లోకి సైనా.. పతకం గ్యారెంటీ

Posted: 08/14/2015 11:52 PM IST
Saina nehwal reaches maiden world badminton championships

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ సంచలనం సృష్టించింది. భారత షెట్లర్లు అందరూ క్రమంగా ఒకరి తరువాత మరోకరు క్వార్టర్స్ వరకు వచ్చి.. అక్కడి నుంచి వెనుదిరిగిన నేపథ్యంలో సెకెండ్ సీడ్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్ ఫైన్సల్ గండాన్ని దాటేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఎట్టకేలకు ప్రపంచ బ్యాడ్మింటన్  చాంపియన్‌షిప్‌లో సెమీస్ లోకి దూసుకెళ్లిన సైనా.. మహిళల సింగిల్స్‌లో పతకం ఖాయం చేసుకుంది.  

ఇప్పటి వరకు వరల్డ్‌ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌లో ఎప్పుడూ క్వార్టర్స్ దాటని సైనా.. ఈ సారి తన అనవాయితీగా వస్తున్న వైఫల్యాన్ని అధిగమించింది. ఈ పోటీలలో సైనాకు ఇది తొలి పతకం కానుంది. గతంలో ఐదుసార్లు క్వార్టర్స్‌లో ఓడిన సైనానెహ్వాల్ శుక్రవారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వాంగ్‌పై 21-15, 19-21, 21-19 సైనా విజయం సాధించింది. తొలి సెట్ లో కొంత వరకు శ్రమించిన గెలుపొందిన సైనా.. రెండవ సెట్ లో పరాజయం పాలైంది. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్ లో ఇరువురు క్రీడాకారిణుల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో సైనా గెలుపొందింది. ఈ విజయంతో కాంస్య పతకం ఖాయం చేసుకున్న సైనా బంగారు పతకానికి మరో మ్యాచ్ దూరంలో నిలిచింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Saina Nehwal  Wang Yihan  Medal  World Badminton Championship  

Other Articles