Outstanding Ravichandran Ashwin scalps six, Sri Lanka all out for 183

Ashwin six dismisses sri lanka for 183

Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Virat Kohli, Ajinkya Rahane, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

India have comeback superbly after the stand between Angelo Mathews (64) and Dinesh Chandimal (59) looked to take the game away from India. Ashwin took 6 for 46 to help India bowl out Sri Lanka for 183

అశ్విన్ స్పిన్ మాయాజాలం.. లంక 183 విక్కెట్లకు అలౌట్

Posted: 08/12/2015 03:34 PM IST
Ashwin six dismisses sri lanka for 183

భారత్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను భారత బౌలర్లు మట్టికరిపించారు. దీంతో లంక జట్టు కేవలం 183 పరుగులకే చాపచుట్టేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టును అది నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లను భారత పేసర్లు వెనక్కు పంపగా, తన మెరుగైన ఆటతీరుతో రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ఊపరి సల్పనీయకుండా చేశారు. ఆతిథ్య జట్టు భారత స్పిన్నర్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడింది. అశ్విన్ అద్భుతంగా రాణించడంతో లంక 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

లంక బ్యాట్స్‌మెన్‌లలో మాథ్యూస్ 64, చండిమాల్ 59 పరుగులతో రాణించి లంక పరువుని కాపాడారు. మిగిలిన వారందరూ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్న(9), కౌశల్ సిల్వ(5) భారత్ పేసర్లు ఇషాంత్, అరోన్‌ దెబ్బకు వెంట వెంటనే వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగర్కర్ కూడా 5 పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరడంతో లంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆ తరువాత వచ్చిన తిరిమన్నె, ముబారక్‌ను కూడా అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించాడు.

దీంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు కోల్పయిన లంక జట్టును మాథ్యూస్, చండిమాల్ కు ఆదుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లు కరుణరత్నే 9, శిల్వ 5, తిరిమన్నే 13, సంగక్కర 5, ముభారక్ డకౌట్ కాగా మథ్యూస్ 64, ఛండీమాల్ 59, ప్రసాద్ డకౌట్, హేరత్ 23, కౌషల్ డకౌట్ కాగా ప్రదీప్ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లు ఇషాంత్ శర్మ1, అశ్వన్ 6, అరోన్1, మిశ్రా 2 వికెట్లు తీసుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  India  srilanka  ind vs srl  India vs srilanka  ind vs sri 2015  

Other Articles