chandrababu Naidu | KCR | ap | telangana

Chandrababu naidu and kcr vying in wasting public money

chandrababu Naidu, KCR, ap, telangana, luxuries, Convoy, cars, buses

chandrababu Naidu and KCR vying in wasting public money It looks like Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and his Telangana counterpart K Chandrasekhar Rao are competing with each other not in taking up developmental programmes, but in wasting public money for their own luxuries.

ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ వందల కోట్ల దుబారా

Posted: 08/11/2015 10:51 AM IST
Chandrababu naidu and kcr vying in wasting public money

రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ది చెందుతాయి... తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు మరింత ఎగరుతాయి అని ఎంతో ఊహించుకున్న వారికి అసలు సీన్ ఏంటో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. అనుకున్న దొక్కటి .. అయ్యిందొక్కటి.. బోల్తా పడ్డావులే... బుల్ బుల్ పిట్ట అని తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. అయితే ఇదే లైన్ తెలుగు ప్రజలకు కూడా వర్తిస్తుంది. అటు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఏపిలో నారా చంద్రాబాబు నాయుడు తమతమ రాష్ట్రాలను అభివృద్ది చేస్తారని అనుకుంటే దాని మీద కాకుండా దుబారా ఖర్చులు ఎలా చేయాలో అన్న అంశంలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. నేనంటే నేను అన్నట్లు పోటీగా ఖర్చు చేస్తుండటం విశేషం. ఏపి సిఎం చంద్రబాబు నాయుడుగారి దుబారా ఖర్చు గురించి స్థానికంగానే కాదు నేషనల్ మీడియాలో కూడా ఎంతో పేరు మోసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అనవసర ఖర్చు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... పక్క వాడు చిటికె వేస్తే .. మనం తొడగొట్టాలి అని మీసాలు మెలేస్తున్నారు అయితే అభివృద్దిలో ఇలా పోటీ పడితే తెలుగు వారు బాగుపడతారు కానీ అలా కాదు.. ప్రజల ఖర్చును ఎలా ఖర్చు చెయ్యాలి అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. గతంలోనే తన కాన్వాయ్ లోని వాహనాలను మార్చిన కేసీఆర్ మరోసారి ఐదు కోట్లు ఖర్చు చేసి మరోసారి మార్పులు తీసుకువచ్చారు. ఖరీదైన బస్సు, ఖరీదైన కాన్వాయ్ ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగారు ప్రజల సొమ్ములను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఏసి సిఎం చంద్రబాబు నాయుడు గురించి అయితే దేశం మొత్తం తెలుసు. అయ్యగారు తీసుకువచ్చే ఇన్వెస్టిమెంట్స్ సంగతి ఏమో కానీ ప్రతి పర్యటనకు తడిసిమోపెడవుతోంది. విదేశీ పర్యటనకు, చంద్రబాబు, అతని బృందానికి చేస్తున్న అరేంజ్ మెంట్ లకు భారీ ఖర్చు వస్తోంది. కనీసం ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డబ్బులను ఎలా దుబారాగా ఖర్చు చెయ్యాలి అన్నదాని మీద కాకుండా ఎలా సంపాదించాలి, ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందించాలి అన్న దాని మీద దృష్టిసారిస్తే చాలా మంచిది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chandrababu Naidu  KCR  ap  telangana  luxuries  Convoy  cars  buses  

Other Articles