Sania Mirza | Fine | Traffic police

Sania mirza fined for violating traffic rules

Sania Mirza, Fine, Traffic police, challan, hyderabad, Sania mirza car

Sania Mirza Fined For Violating Traffic Rules Hyderabad police on Monday night imposed a fine of Rs.200 as the number plate of her car was found to be in violation of the rules. Police sources said the number plate was not as per the format prescribed by the traffic police and hence a challan was issued.

సానియా మీర్జా కారుకు చలాన వేసిన ట్రాఫిక్ పోలీసులు

Posted: 08/11/2015 11:33 AM IST
Sania mirza fined for violating traffic rules

చట్టం ఎవరికి చుట్టం కాదు అని తెలుగు సినిమాల్లోనూ., రాజకీయ నాయకుల మాటల్లోనూ వినిపిస్తుంది. అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్న సిద్దాంతాన్ని తూ.చ తప్పకుండా పాటించారు తెలంగాణ పోలీసులు. ఇంతకీ అంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటీ అనుకుంటున్నారా..? తాజాగా తెలంగాణ పోలీసులు ఒకరికి ట్రాఫిక్ రూల్స్ కు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఉన్నందుకు రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తూ చలనా రాశారు. ఈ చలనా రాసిన కారు తెలంగాణ రాష్ట్రానికి, ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో ఓ లెజెండ్ కావడంతో వార్తల్లో నిలిచింది. మొత్తానికి ఒక చలానా వార్తల్లో స్పెషల్ గా నిలిచింది. ఇంతకీ ఆ కార్ ఓనర్ ఎవరో తెలుసా..? హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.

అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ జారీ చేశా రు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఆమె కారు నంబరు ప్లేటుపై అక్షరాలు, అంకెలు డిజైన్ చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్‌ను జారీ చేశారు. రోడ్ నంబర్ 10లో ఈ వాహనం పార్క్ చేసినప్పు డు ట్యాబ్ కెమెరాతో క్లిక్ అనిపించిన ట్రాఫిక్ పోలీసులు.. టొయోటా ఫార్చూనర్ కార్ నంబర్ టీఎస్09ఈజీ0001కు ఈ-టికెట్ క్రేన్ 41 సీపీయాక్ట్ కింద 200రూపాయలు ఫైన్ విధించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించే లా నంబరు ప్లేటు ఉన్నట్లు చలాన్‌లో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా ఈ కారు సానియామీర్జా పేరు మీద ఉన్నట్లు వెలుగుచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Fine  Traffic police  challan  hyderabad  Sania mirza car  

Other Articles