muni kamakoti shifted to KMC hospital

Muni kamakoti condition still critical

muni koti, muni kama koti, bmk koti, suicide attempt, AP special status, congress protest, Congress activist mmolate self for AP special status, man set afire, muni koti, ke krishna moorthy, somireddy chandramohan reddy, Tirupati, Congress Activist set afire, Special Status for AP, Man sets himself ablaze, Congress-sponsered protest, Tirupati, youth commits suicide, muni koti, AP congress meet, Tirupati

Docters say muni kamakoti health condition is still critical, cant say any thing uptill 24 hours.

విషమయంగానే మునికోటి పరిస్థితి.. కేఎంసీ ఆస్పత్రికి తరలింపు

Posted: 08/09/2015 11:38 AM IST
Muni kamakoti condition still critical

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి సిద్ధమైన మునికామ కోటి(41) ఆరోగ్య పరిస్థతి విషమంగానే వుందని వైద్యులు వెల్లడించారు. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మునికోటి పరిస్థతిపై ఇప్పుడే ఎం చెప్పలేమన్న వైద్యులు.. 24 గంటలు గడిస్తే కానీ, ఏమీ చెప్పలేమని చెప్పారు. ఈ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆస్పత్రి డైరెక్టర్ భరద్వాజ తెలిపారు. రాష్ట్ర విభజనతో అంధకారంలోకి నెట్టివేయబడ్డ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

50 శాతంపైగా కాలిన గాయాలయిన వారిని సీఎంసీ ఆస్పత్రిలో చేర్చుకోరు. రాజకీయ నాయకుల రికమండేషన్ తో మునికామ కోటిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిన్నరాత్రి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.

ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హెదాపై ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మునికామకోటి ఆరోగ్య పరిస్థితిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సమాచా తెలుసుకున్నారు. ఏపీ పిసీసీ ఛీప్ రఘువీరారెడ్డికి ఆమె ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకున్నారు. మునికోటి సహా శ్ేషాద్రిలకు కేంద్ర పార్టీ నుంచి కూడా సహాయాన్ని అందిస్తామని చెప్పారు. బాధితులిద్దరికీ ెరుగైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సోనియాగాంధీ రఘువీరారెడ్డిని అదేశించినట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muni koti  muni kama koti  bmk koti  suicide attempt  AP special status  congress protest  

Other Articles