Tirupati Laddu | 300Years | Venkateshwara Swamy

Tirumala tirupati prasadam laddu completed 300 years

Tirupati Laddu, Laddu, Tirumala Laddu, Laddu Prasadam, 300Years, Tirupati, Venkateshwara Swamy, Laddu prasadam in Tirupati

Tirumala Tirupati prasadam laddu completed 300 years. Sri Venkateshwara devotees love the Laddu prasadam very much. The Laddu also got Geo Graphical Indication status.

తిరపతి లడ్డూకు 300 సంవత్సరాలు

Posted: 08/06/2015 03:20 PM IST
Tirumala tirupati prasadam laddu completed 300 years

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం ప్రారంభమై 300వ ఏట అడుగుపెట్టింది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టు లో ప్రారంభమైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని భక్తులు భావిస్తారు. చక్కెర, శనగపిండి, ప్రశస్తమైన నెయ్యి, ఆయిల్, యాలకులు, నాణ్యమైన జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ తో చేసే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు నోరూరించే స్వామి లడ్డూ ప్రసాదం తీసుకోవడం కోసం ఆరాటపడతారు.

రకరకాలైన ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. 2014లో స్వామివారి ప్రసాదంగా 9 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. 300 గ్రాముల బరువుండే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ధర సాధారణంగా రూ. 25గా ఉండాలి. లడ్డూ తయారీలో వినియోగించే పదార్థాల ధర అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ స్వామి భక్తులకు అత్యధికంగా సబ్సిడీ ఇచ్చి అందజేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. స్వామి భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక్కొక్కటి రూ. 10 చొప్పున రెండు లడ్డూలను అందజేస్తున్నట్లు తెలిపింది.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శ్రీవారి లడ్డూలను దేశ రాజధాని ఢిల్లీలోను, కొన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో కూడా తయారు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విక్రయం ఆలయానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తుంది. శ్రీవారి లడ్డూ తయారీ కోసం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆలయం బడ్జెట్ లో  2,401 కోట్ల రూపాయలు కేటాయించడం దాని ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా  190 కోట్ల ఆదాయాన్ని సమకూరుతోంది. స్వామి వారికి మొక్కుబడి రూపంలో భక్తులు సమర్పించిన తలనీలాలను విక్రయించడం వల్ల కూడా అంతే మొత్తంలో ఆదాయం వస్తోందని వివరించింది.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూ ప్రసాదాలను రోజంతా విక్రయిస్తూనే ఉంటుంది. గత ఏడాది బ్రహ్మోత్సవాల మొదటి ఏడు రోజుల్లో అంతకు ముందున్న రికార్డులను బద్దలు కొడుతూ 1.8 మిలియన్ లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీకి ఉంది. అయితే.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతుంది. తిరుమలలో 270 మంది వంటవారితో సహా మొత్తం 620 మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కిచెన్ ను గత ఏడాది ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు. బూందీ క్రేట్స్-ను, లడ్డూలను మోసుకుపోయేందుకు రెండు ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఎస్కలేటర్లు రోజుకు 8 లక్షల లడ్డూలను తీసుకుపోయే సామర్ధ్యం కలిగి ఉన్నాయని టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజు చెప్పారు. తిరుపతి లడ్డూకు పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ ను ఇవ్వడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles