Telangana | Jobs | Notification

Telangana govt may announce 12 thousand jobs soon

Telangana, Jobs, Notification, Telangana Govt Jobs, Govt Jobs, Tpsc, TSPSC, KCR, Telangana job news

Telangana govt may announce 12 thousand jobs soon. Telangana govt already palns to release notification to 25 thousand jobs in state.

కొత్తగా మరో 12వేల ఖాళీల భర్తీకి సిద్దం

Posted: 08/03/2015 09:37 AM IST
Telangana govt may announce 12 thousand jobs soon

ఉద్యోగాలు... బోలెడన్ని ఉద్యోగాలు.. గవర్నమెంట్ జాబులు.. తాజాగా తెలంగాణ నిరుద్యోగుల జపం ఇదే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి తెలంగాణ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొదటి విడతగా 15 వేల పోస్టులను భర్తీ చెయ్యనున్న ప్రభుత్వం మరో పది వేల పోస్టుల భర్తీకి కూడా సిద్దంగా ఉంది. అయితే రానున్న మరో పది వేల ఉద్యోగాల గురించి నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఉంటే.. తాజాగా మరో 12 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురులు అందిస్తూనే ఉంది.

త్వరలో అమలు చేయనున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున గ్రామ స్థాయిలో కీలకమైన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దాదాపు 2 వేలకుపైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఈ విడతలో ప్రకటించనుంది. ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్న ఈ ఫైలు ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. జూలై నెలలోనే విధిగా నియామక  ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో రెండో విడత ప్రకటన కూడా వీలైనంత తొందరగా జారీ అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి తెలంగాణ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్ల వెల్లువ తొందరలోనే ప్రారంభం కానుంది అన్నది స్పష్టమైంది. ఇక నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించేందుకు ప్రయత్నించడమే మిగిలి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Jobs  Notification  Telangana Govt Jobs  Govt Jobs  Tpsc  TSPSC  KCR  Telangana job news  

Other Articles