DRDO | Abdul Kalam | KCR

Kcr urged the central government to abdul kalam name for drdo

DRDO, Abdul Kalam, KCR, Modi, Central Govt, APJ Abdul Kalam, KCR letter to Modi, APJ Abdul Kalam in DRDO

KCR urged the central government to Abdul Kalam name for DRDO. Telangana Chief Minister K. Chandrasekhar Rao urged the central government to name Defence Research and Development Organisation (DRDO) after former president A.P.J. Abdul Kalam, who died last week.

డీఆర్డీవోకు అబ్దుల్ కలాం పేరు పెట్టండి

Posted: 08/03/2015 09:32 AM IST
Kcr urged the central government to abdul kalam name for drdo

హైదరాబాద్‌లోని డీఆర్డీవో కు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కలాంకు హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఉన్నదని  ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో కేసీఆర్ తెలిపారు. డీఆర్డీవోకు కలాం పేరు పెట్టడం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని, భారత రక్షణ వ్యవస్థ ఆయనకు నివాళులర్పించినట్లవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రక్షణరంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించేందుకు డీఆర్డీవోలో జరిగిన పరిశోధనలు ఎంతో దోహదపడ్డాయన్నారు. ప్రతిష్ఠాత్మకమైన డీఆర్డీవోకు కలాం డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలోనే అనేక పరిశోధనలు జరిగాయని సీఎం తన లేఖలో తెలిపారు.

డిఆర్డీఎల్, మిథాని, ఆర్‌సీఐ, ఐసీబీఎం వంటి పలు రక్షణశాఖ అనుబంధ సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వెనుక కలాం కృషి ఉన్నదని వివరించారు. అటువంటి గొప్పవ్యక్తి పేరు డీఆర్‌డీవోకు పెట్టాలని ప్రధానికి రాసిన లేఖలో కోరారు. కాగా డిఆర్డీవోకు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కేసీఆర్ లేఖ కన్నా ముందు కలాం ఫోటోను కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రచారం సాగుతోంది. ఇప్పటిదాకా ఉన్న గాంధీ బొమ్మ స్థానంలో కొత్తగా మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్తఐన అబ్దుల్ కలాం ఫోటోను ముద్రించాలని సోషల్ మీడియాలో బాగా ప్రచారం సాగుతోంది. కాగా ప్రధాని మోదీ కూడా అబ్దుల్ కలాం పేరును చిరకాలం గుర్తుండేలా చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DRDO  Abdul Kalam  KCR  Modi  Central Govt  APJ Abdul Kalam  KCR letter to Modi  APJ Abdul Kalam in DRDO  

Other Articles