Arun Tiwari Says Abdul Kalam Wrote About His Death In Transcendence Book | Indian Presidents

Abdul kalam death mystery transcendence book arun tiwari

abdul kalam, abdul kalam news, abdul kalam death, abdul kalam latest news, abdul kalam Transcendence, Transcendence book, abdul kalam with arun tiwari, arun tiwari about abdul kalam, abdul kalam death mystery

Abdul Kalam Death Mystery Transcendence Book Arun Tiwari : Arun Tiwari Says Abdul Kalam Wrote About His Death In Transcendence Book

తన మరణంపై ముందుగానే వ్యాఖ్యలు చేసిన ‘కలాం’

Posted: 07/31/2015 10:13 AM IST
Abdul kalam death mystery transcendence book arun tiwari

భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జూలై 27వ తేదీన తనువు చాలించారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అంటూ విద్యార్థులకు తమ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించిన ఈయనకు.. తన మరణం గురించి ముందే తెలిసిందట. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అరుణ్ తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు. 33 ఏళ్లపాటు కలాంకు సహాయకుడిగానే కాకుండా ఆయన రచనల్లోనూ తివారీ పాలుపంచుకున్నారు. తాజాగా కలాం గురించి ఈయన మాట్లాడుతూ.. తాను చనిపోవడానికి ముందే తన మరణంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని తివారీ పేర్కొన్నారు.

కలాం తాజా పుస్తకం ‘ట్రాన్సెండెన్స్’లోని 50వ పేజీలో ఆయన రాసిన వ్యాఖ్యలను తివారీ గుర్తు చేసుకున్నారు. ‘చివరికి స్వామీజీ నన్ను భగవంతుడి సమతుల్య కక్ష్యలోకి నెట్టారు. ఇలా ఎలాంటి యుక్తులు అవసరం లేదు. శాశ్వతమైన అంతిమ స్థితికి నన్ను చేర్చారు’ అంటూ కలాం ఆ పేజీలో రాశారు. ఈ వ్యాఖ్యల గురించి తివారీ ప్రస్తావిస్తూ.. కలాంకు తన మరణంపై ముందే తెలిసిపోయిందని వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Transcendence book  abdul kalam  arun tiwari  

Other Articles