High Court Dismissed Revanth Reddy Latest Petition | Cash For Vote

High court dismissed revanth reddy petition

revanth reddy, cash for vote, revanth reddy latest news, revanth reddy controversy, cash for vote, cash for vote controversy, high court, revanth reddy, cash for vote revanth reddy, high court news

High Court Dismissed Revanth Reddy Petition : Hyderabad High Court Dismissed Revanth Reddy Latest Petition In Which He Requests To Cancel His Conditional Bail.

రేవంత్ రెడ్డికి ఝలకిచ్చిన హైకోర్టు

Posted: 07/31/2015 10:41 AM IST
High court dismissed revanth reddy petition

టీ-టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి హైకోర్టు ఝలకిచ్చింది. ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ కి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే! నియోజకవర్గం వీడరాదనే షరతుతో హైకోర్టు అప్పట్లో బెయిలిచ్చింది. అయితే.. ఇప్పుడు తన షరతులను సడలించాలని కోరుతూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు..  బెయిల్ షరుతల సడలింపుకు ససెమిరా అంటూ కొట్టివేసింది.

తెలుగుదేశం పార్టీ శాసనజభా పక్ష ఉపనేతగా వున్న కారణంగా తాను తరచూ హైదరాబాదుకు వెళ్లాల్సిన అవసరం వుందని రేవంత్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కారణంగా కొడంగల్ దాటి బయటకు రాకూడదన్న షరతును తొలగించాలని ఆయన కోర్టును కోరారు. అయితే.. దీనికి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవండ్ రెడ్డి హైదరాబాదుకు వస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారని, కాబట్టి ఆయన పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. విచారించిన అనంతరం రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  high court  cash for vote  

Other Articles