Lalith Modi | Vapam scam | BJP | Modi, Congress, Rahul Gandhi, Parliament, Amith sha

Bjp excellent strategy to prevent congress party and opposition parties

Lalith Modi, Vapam scam, BJP, Modi, Congress, Rahul Gandhi, Parliament, Amith sha

BJP excellent strategy to prevent Congress party and opposition parties. BJP announce that the govt ready to discuss the Vapam and lalith modi issues.

బిజెపి ప్లాన్ కేక... కాంగ్రెస్ కు పక్కాగా చెక్

Posted: 07/23/2015 03:04 PM IST
Bjp excellent strategy to prevent congress party and opposition parties

నిన్నటి నుండి ప్రాంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏకిపారేయ్యాలని కాంగ్రెస్ నాయకులు ఎంతలా కారాలు మిరియాలు నూరినా... పార్లమెంట్ లోసల మాత్రం సినిమా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు, మిగిలిన పక్షాలు ఎంతగా ఊహించుకున్నా కానీ సినిమా మాత్రం ఎన్డీయే ప్రభుత్వమే చూపిస్తోంది. ఎంతలా ప్రతిపక్షాలు ఒక్కిరిబిక్కిరి చేద్దామని అనుకుంటున్నా కానీ బిజెపి నాయకులు మాత్రం ఎంతో చాకచక్యంగా పార్లమెంట్ పమావేశాల్లో సాగుతున్నారు. పార్లమెంట్ వేదిక అధికార పక్షం మీద వస్తున్న విమర్శలతో ఎంతగా ఎండగడదామని అనుకున్నా కానీ కాంగ్రెస్, మిగిలిన ప్రతిపక్షాలు దానిలో పూర్తిగా విజయం సాధించలేకపోతున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రతిపక్షాలు విజయం సాధించాయని చెప్పాలి.. ఏ విషయంలో అనుకుంటున్నారా..? పార్లమెంట్ లో వాయిదాల పర్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు తమ వంతుగా కృషి చేస్తున్న మాట మాత్రం వాస్తవం.

Also Read:  సీఎం చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంలో దోషే

వ్యాపం స్కాం... ఇది ఓ రాష్ట్రంలో నియామకాల మీద జరిగిన అతి పెద్ద మిస్టీరియస్ స్కాం. అయితే దీని మీద ప్రతిపక్షాలు ఎలాగైనా సరే అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే పార్లమెంట్ లో చర్చకు తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించేంసింది. అధికార పక్షం చర్చకు సమయం కావాలని కోరుతుందనో లేదంటే అసలే చర్చకు ముందు రాదు అని భావించిన ప్రతిపక్షాలకు షాక్ తగిలింది. అలాగే లలిత్ మోదీ వ్యవహారం మీద ప్రతిపక్షాలు కోరిన విధంగా చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని అధికార పక్షం ప్రకటించేసింది.

Also Read:  లలిత్ మోదీ వ్యవహారంపై రాజ్యసహభలో రచ్చ

ఇక పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఏ విషయాల మీద చర్చకు సిద్దమో.. వాటి మీద చర్చకు సిద్దమని ప్రకటిస్తూనే.. కాంగ్రెస్ హయాంలో ఉన్న రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అన్ని స్కాంల మీద, తలెత్తిన వివాదాల మీద చర్చకు రావాలని కూడా అధికార పక్షం పట్టుబడుతోంది. దాంతో ప్రతిపక్షాలకు కాస్త షాక్ తగిలింది. అలా కనక చేస్తే తమ పరువే పొతుందని భయపడుతుందో లేదంటే ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. మొత్తానికి కీలక బిల్లుల మీద వెనక్కి తగ్గేది లేదు అంటూనే.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద దాడికి సిద్దంగా ఉంది. అయినా మోదీ, అమిత్ షా లాంటి రాజకీయ పండితుల రాజకీయ నీతి ఇలానే ఉంటుంది అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalith Modi  Vapam scam  BJP  Modi  Congress  Rahul Gandhi  Parliament  Amith sha  

Other Articles