TDP | Parliament | AP | Special status | Parliament Sessions

Tdp mps display placards at the parliament for special status

TDP, Parliament, AP, Special status, Parliament Sessions

TDP MPs display placards at the parliament for special status demand TDP mps demand to discuss the special status for ap and also the problems of ap.

మొత్తానికి పట్టుకున్నారు.. ప్లకార్డులు

Posted: 07/23/2015 11:47 AM IST
Tdp mps display placards at the parliament for special status

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా గొంతెత్తుతారా.? ప్రత్యేక హోదా మీద మాట్లాడతారా.? ఏపికి నిధుల మీద నిలదీస్తారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు. అయినా సమాధానాలు మాత్రం లేవు. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా ఏపికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష పార్టీ. కాగా మిత్రపక్ష పార్టీ అయినా గానీ ఏపికి నిధులు, ప్రత్యేక హోదా మీద హామీ తెచ్చుకోవడంలో మాత్రం పెద్దగా సఫలం కాలేదు. సరే జరిగిందేదో జరిగింది కనీసం.. ఈ సారైనా పోరాడితే సరిపోతుందని అందరూ అనుకుంటున్నారు. తాజాగా ఏపి నూతన రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ సిద్దం కావడం.... ఇక నిర్మాణానికి అంతా సిద్దమవుతున్న వేళ టిడిపి కూడా కేంద్రం మీద ఓ వైపు మైత్రిని కొనసాగిస్తూనే నిరసన తెలుపుతూ... తమకు కావాల్సింది సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

Also Read :  టిడిపి బిజెపికి ఊడిగం చేస్తోంది.. కాదంటారా?

తెలుగుదేశం పార్టీ, ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉండటంతో పాటు ఎంపీలు ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి పదవులను కూడా అనుభవిస్తున్నారు. అయితే మంత్రి పదవులు ఇవ్వడం వరకే తెలుగుదేశం పార్టీని పరిమితం చేసింది బిజెపి నాయకత్వం. ఎన్నికలకు ముందు ఏపికి పూర్తి స్థాయి న్యాయం చేస్తామని.. ఏపిని అన్ని విధాల ఆదుకుంటామని బిజెపి నాయకులు హామీల మీద హామీలు ఇచ్చారు. సరే ఎన్నికలు ముగిశాయి.. తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. విభజన సమయంలో ఏపికి జరిగిన అన్యాయానికి... బిజెపి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకుంటే పరిస్థితి అలా కనిపించడం లేదు.

Also Read :  తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తారో...!

ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి ఎప్పుడో ఏడాది దాటింది. కానీ ఏపికి ప్రత్యేక హోదా మీద మాత్రం స్పష్టత రాలేదు. అయితే తాజాగా వెంకయ్య నాయుడు ఏపి విభజన చట్టంలో ఎక్కడా కూడా అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం హామీ వెల్లడించలేదని అన్నారు. దాంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా నిన్నటి నుండి ప్రారంభమైన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చింది. తాజాగా ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని... ఏపి సమస్యల మీద చర్చించాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ గోడు వినాలంటూ పార్లమెంట్ బయట నినాదాలు చేశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇన్నాళ్లకు కాస్త కనువిప్పి కలిగినట్లుంది. అందుకే మిత్రపక్షంగా ఉన్నా కూడా కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు టిడిపి ఎంపీలు. మరి వారి డిమాండ్ ఫలిస్తుందో లేదో చూడాలి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Parliament  AP  Special status  Parliament Sessions  

Other Articles