Jharkhand Minister | tribute | Abdul Kalam

Jharkhand minister pays respect to former president apj abdul kalam

Jharkhand Minister ,tribute ,Abdul Kalam

Jharkhand Minister Pays Respect To Former President APJ Abdul Kalam. A Jharkhand minister found herself at the receiving end of jokes after being seen paying tribute to a garlanded photo of former President APJ Abdul Kalam in images that surfaced on social media. The pictures were reportedly taken at a school function where Neera Yadav, the state's Human Resource Development minister, was chief guest. The pictures were published in a newspaper.

అబ్దుల్ కలాంకు శ్రద్దాంజలి.. సోషల్ మీడియాలో దుమారం

Posted: 07/23/2015 09:23 AM IST
Jharkhand minister pays respect to former president apj abdul kalam

మాజీ రాష్ట్రపతి, దేశ శాస్ర్త సాంకేతిక రంగానికి ఐకానిక్ గా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అయితే తాజాగా ఓ మంత్రిగారు అబ్దుల్ కలాంకు శ్రద్దాంజలి ఘటించారు. అవాక్కయ్యారా! కానీ నిజం.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మహిళా మంత్రి మన మాజీ రాష్ట్రపతికి శ్రద్ధాంజలి ఘటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ స్కూల్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నీరా యాదవ్ అక్కడ ఉన్న అబ్దుల్ కలాం చిత్రపటానికి దండవేసి, తిలకం దిద్ది, దండం పెట్టారు. ఈ ఫొటోలు తొలుత స్థానిక వార్తా పత్రికల్లో, ఆ తరువాత సామాజిక వెబ్‌సైట్లలో దర్శనమివ్వడంతో.. అవి చూసిన వారందరూ అవాక్కయ్యారు. సజీవంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి నివాళులర్పించిన మంత్రిగారు ఎంతవరకు చదువుకున్నారో చెక్ చేయండి అని ఒకరు. ఆమెది కూడా నకిలీ డిగ్రీయేనేమో (కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీది నకిలీ డిగ్రీ అని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే) అని మరొకరు వ్యాఖ్యానించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్, స్కూల్ టీచర్ ఉమేశ్ ప్రసాద్ సమక్షంలో మహిళా మంత్రి కలాం ఫొటోకు దండ వేసినట్టు తెలిసింది. అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తడంతో తేరుకున్న మహిళా మంత్రి, తాను కేవలం కలాం ఫొటోకు బొట్టు పెట్టానని, అదివరకే ఎవరో దండ వేశారని వివరణ ఇచ్చారు.

అయితే మంత్రి గారి నిర్వాకం సోషల్ మీడియాలో దుమ్మెరేపుతోంది. నెటిజన్లు మంత్రిగారి మీద ఒంటికాలి మీద లేచారు. కనీసం బుద్ది లేకుండా ఇలా తెలివి తక్కువ పని చెయ్యడం ఏంటి అని మండిపడుతున్నారు. నెటిజన్లు అమ్మగారి మీద ఎలా కామెంట్ చేశారో మీరూ చూడండి...

abdul-kalam-twitter-comment

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand Minister  tribute  Abdul Kalam  

Other Articles