Telangana | treasury | Eetala Rajender | KCR | Social sector, Budget

Telangana govt worried about the treasury at empty stage

Telangana, treasury, Eetala Rajender, KCR, Social sector, Budget

Telangana govt worried about the treasury at empty stage. Telangana Finance minister Eetala Rajender told fact about the telangana state treasury.

తెలంగాణ ఖజానా ఘొల్లుమంది

Posted: 07/23/2015 08:34 AM IST
Telangana govt worried about the treasury at empty stage

కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని దొంగ దెబ్బతీసిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ విమర్శించారు. తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన 1,274 కోట్లను సీజ్‌ చేయటం ద్వారా కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించిందని ఆయన వివరించారు. ఈ విషయంలో ఎన్డీయే సర్కారు తమను ముందే అలర్టు చేసి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర చర్యల వల్ల వివిధ పథకాలు, కార్యక్రమాలు, వేతన చెల్లింపులను కొంతమేర సర్దుబాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ వృద్ధిరేటును సాధిస్తోందని తెలిపారు. ఆదాయ, వ్యయాలకు సంబంధించి తమ ప్రభుత్వం ఇప్పటివరకూ 90 నుండి 95 శాతం వరకూ లక్ష్యాలను సాధించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధిస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

గతంలో తెలుగువిశేష్ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయని.. వార్తలు ముందే రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఖజానా ఖాళీ కావడానికి గల కారణాలు, ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి లాంటి అన్ని విషయాలను కవర్ చేస్తూ గతంలోనే తెలుగువిశేష్ వార్తలు రాసింది. దీనిపై పూర్తి ఆర్టికల్ ను చదవడానికి క్లిక్ చేయండి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకూ తాము ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించలేదన్నారు. ప్రధాన ఆదాయ వనరులైన స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, అటవీ, ఖనిజాలు, రవాణాశాఖలతో ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించటం ద్వారా ఆదాయం, రాబడిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. భూముల అమ్మకం, రెవెన్యూ ఆదాయాలను పక్కనబెడితే మిగతా అన్ని అంశాల ద్వారా వచ్చే రాబడి ఆశాజనకంగానే ఉందని అన్నారు. జిఎస్‌డిపిలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా నమోదైందని తెలిపారు. ఆదాయం విషయంలో గుజరాత్‌ తర్వాత తెలంగాణ మాత్రమే అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ చట్ట నియమ నిబంధనలకు లోబడి ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారమే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2015-16 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాల వివరాలను, తాజా పరిస్థితిని తెలిపే ప్రతిని అధికారులు మీడియాకు విడుదల చేశారు.

Also Read: తెలంగాణ ఖజానాకు కటకట.. చాలా కష్టం

ఈటెల రాజేందర్ మాటల్లో ముఖ్యాంశాలు..
* పన్నుల ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయం (అంచనా)...46, 495 కోట్లు
* ఏప్రిల్ నెలలో పన్ను వసూళ్ల ద్వారా 3,070 కోట్లు, మే నెలలో 3,056 కోట్లు, జూన్‌ నెలలో 3,395 కోట్లు, జులై నెల 20వ తేదీవరకు 2,574 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది.
* అంటే బడ్జెట్‌ తర్వాత మూడున్నర నెలల్లో కలిపి పన్ను వసూళ్ల ద్వారా 12,096 కోట్ల ఆదాయం సమకూరింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వం 28 శాతం ఆదాయాన్ని ఆశిస్తే, ఈ మూడున్నర నెలలకాలంలో ఆర్జించిన ఆదాయం ప్రభుత్వానికి ప్రోత్సాహకరంగా ఉంది.
* గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉంది.
* బడ్జెట్‌ అంచనాల ప్రకారం...రెవెన్యూ వసూళ్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 77,581 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గడిచిన మూడున్నర నెల్లకాలంలో ఈ రూపంలో ప్రభుత్వం 25,970 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో ఇది 33.5 శాతంగా నమోదైంది. రెవెన్యూ వసూళ్ల ద్వారా ఏప్రిల్ లో 6,660 కోట్లు, మేలో 6,506 కోట్లు, జూన్‌లో 6,662 కోట్లు, జులైలో (ఇప్పటి వరకు) రూ.6,142 కోట్ల ఆదాయం సమకూరింది.
* ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ నియమ నిబంధనలు, పరిమితికి లోబడి తెలంగాణ ప్రభుత్వం రూ.6,150 కోట్ల రుణం తెచ్చుకునే వీలుంది.
* మొత్తం బడ్జెట్‌(1,15,689 కోట్లు)లో ఇప్పటి వరకు వివిధ ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాల కోసం ప్రభుత్వం 31,872 కోట్లను ఖర్చు చేసింది.

 

Also Read: తెలంగాణ ఖజానాకు కష్టాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  treasury  Eetala Rajender  KCR  Social sector  Budget  

Other Articles