Amaravathi | Chandrababu naidu | KCR, AP, Telangana, Dasharathi, Media house, AP capital city news

Kcr spoke about the ap capital city amaravathi and chandrababu naidu

Amaravathi, Chandrababu naidu, KCR, AP, Telangana, Dasharathi, Media house, AP capital city news

KCR spoke about the ap capital city Amaravathi and chandrababu naidu. KCR fire on chandrababu naidu and also on media houses which, published relevant articles on amaravathi.

అమరావతి కాకపోతే.. ఆరావళి కట్టుకోండి: కేసీఆర్

Posted: 07/22/2015 04:52 PM IST
Kcr spoke about the ap capital city amaravathi and chandrababu naidu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు. పనిలోపనిగా కొన్ని మీడియా సంస్థలకు తలంటారు. ఏపి రాజధాపి అమరావతి మీద మాట్లాడుతూ.. అమరావతి కాకపోతే ఆరావళి కటట్ుకోండి అని.. ఏపి రాజధాని వర్థిల్లాలని తాము కూడా కోరుకుంటున్నట్లు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా కొంత మంది బద్ది ఇంకా మారలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తమ బతుకు మమ్మల్ని బతకనీయండి మహా ప్రబో అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా అనవసరమయిన, అసందర్భోచిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఏమయినా అనండి కానీ నా రాష్ర్టాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ సమాజాన్ని, ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా సహించేదిలేదన్నారు. ఎంతవరకైనా ఎళ్తామని హెచ్చరించారు.

తెలంగాణపై మాటిమాటికి వెకిలి మాటలు మాట్లాడటం మాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించి అక్కడి ప్రజలకు ఏంకావాలో చేసిపెట్టాలని, అమరావతి కాకపోతే ఆరావళి కట్టుకోండి, ఏపీ రాజధాని వర్ధిల్లాలని మేమూ కోరుకుంటాము, కానీ తమ జోలికొస్తే మాత్రం ఎంతవరకైనా వెళ్తాము అని కేసీఆర్ చంద్రబాబునుద్దేశించి అన్నారు. ఎంత ఓర్చుకున్నా, సహించినా ఎప్పుడూ ఎదో ఒక వంకర మాట మాట్లాడటం, ఎదో ఒక పనికి అడ్డుపడటం చంద్రబాబు చేస్తున్నాడని, దీన్ని తెలంగాణ మేథావులు, కవులు, కళాకారులు తమ కవిత్వాల ద్వారా కడిగిపారేయాలని కోరారు. ఇక్కడ అవసరం లేని వార్తలను కొన్ని పత్రికలు పుంకానుపుంకాలుగా తెలంగాణ ప్రజలపై రద్దుతున్నారని, అమరావతి రాజధాని గురించి అంతంత పెద్దవార్తలు పేజీలకు పేజీలు ప్రచురించి తెలంగాణ ప్రజమీద రుద్దడం అవసరమా? అని ప్రశ్నించారు.

శారీరక శ్రమకు అలవాటుపడ్డ హైదరాబాదీలు ఎన్టీరామారావు వచ్చిన తర్వాతే ఉదయాన్నే నిద్రలేవడం నేర్చుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మాట్లడటంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ సమాజానికి బాడీ పెరిగింది తప్ప బుద్ది పెరగలేదు అన్న కోణంలో చంద్రబాబు మాట్లడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు చరిత్రను, ఇవాళ ఎవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, శాతాబ్దాలుగా హైదరాబాదు గొప్పగా బతికిందని, తెలంగాణకు హైదరాబాదు రాజధాని కావడం ఓ వరమని సీఎం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi  Chandrababu naidu  KCR  AP  Telangana  Dasharathi  Media house  AP capital city news  

Other Articles