Devotees misfelt venkaiah chowdary as cine actor shafi | rajamundry pushkara ghar | godavari pushkaraalu

Devotees misfelt venkaiah chowdary as cine actor shafi

Venkaian chowdary, officer on special duty, chandrababu, shafi, godavari pushkaraalu, rajamundry pushkara ghar, tollywood actor shafi,

godavari pushkaraalu devotees at rajamundry pushkara ghat mis felt AP CM chandrababu naidu osd venkaiah chaowdary as tollywood actor shafi

సినీనటుడు షఫీ అనుకున్నారు.. కానీ అతను వెంకయ్య చౌదరి

Posted: 07/17/2015 07:17 PM IST
Devotees misfelt venkaiah chowdary as cine actor shafi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో వుంటూ.. గోదావరి పుష్కరాలను పర్యవేక్షిస్తున్న క్రమంలో.. ఆయన ఓఎస్డీ వెంకయ్య చౌదరి వార్తల్లోని వ్యక్తిగా మారారు. అదేంటి బాబు గారి ఓఎస్డీ వార్తల్లోని వ్యక్తిగా ఎలా మారారు.? ఎందుకు మారారు ..? అంటారా..? ఏకంగా ఆయనే మారితేనో..? మళ్లి ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా..? అవునండి నిజమే..! చంద్రబాబు ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజమండ్రి పుష్కర ఘాట్ లోకి దిగి దిగగానే అప్పటి వరకు ఎవరి మానాన వారు తమ పనులలో నిమగ్నమైన భక్తులు ఒక్కసారిగా అతన్ని చూడగానే అకర్షితులయ్యారు.

 అదేంటి బాబు గారి ఓఎస్డీకి అంత పలుకుబడి వుందా..? అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరిని చదవాల్సిందే. రాజమండ్రి పుష్కరఘాట్ లో ఆయనను చూడగానే గబుక్కున ఆయన వద్దకు వెళ్లి నమస్కారం.. బాగున్నారా..? అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. దీనికి కారణం ఆయన టాలీవుడ్ నటుడు, ప్రతినాయకుడి వేషాలలో తెలుగు ప్రజలకు సుపరిచితుడైన షఫీని పోలివుంటారు. దీంతో అతని వద్దకు వెళ్లిన భక్తులు మీరు చత్రపతి, ఖడ్గం చిత్రాలలో నటించారు కదూ..? అని అడిగారు.

చిరునవ్వుతో కాదంటూ సైగ చేసిన ఆయన తన ఐడింటిడీ కార్డును తీసి చూసించే సరికి.. ఔరా.. మనిషిని పోలిన మనుషులు వుంటారని అంటుంటారు. నిజమే. అచ్చు సినిమా నటుడు షఫీలా వున్నాడనుకుంటూ కోందరు తమ పనుల్లో నిమగ్నమవ్వగా. మరికోందరు మాత్రం షఫీ లాంటి వ్యక్తలను ఇద్దరి చూశాం. మరో ఐదుగులు ఎక్కడ కనబడతారో మరి..? అంటూ వెళ్లారు. అయితే సాధారణ భక్తులే కాదు మీడియా ప్రతినిధులు కూడా వెంకయ్య చౌదరి విషయంలో బొల్తా పడ్డారు. అతను పుష్కర ఘాట్ లోకి దిగగానే వెంటనే వెళ్లి కెమెరాలు క్లిక్ మనిపించిన పాత్రికేయులు.. విషయం తెలుసుకున్నాక ఆశ్చర్యానికి గురయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaian chowdary  officer on special duty  chandrababu  shafi  godavari pushkaraalu  

Other Articles