Arizona cop under investigation for 'illegally' entering woman’s home and handcuffing her – while she was naked

Police officer being investigated for handcuffing naked woman in her home

US police, arrest, Chandler Police, naked women, Chandler Police officer, Doug Rose, Esmerelda Rossi, married women molest, women molestation in US, wiomen molestation in chandler, women molest in america, molestation, molest, violence against women, crime against women, harrassment against women

An Arizona woman was arrested after a police officer “illegally” barged into her home and placed her in handcuffs while she was naked.

ITEMVIDEOS: వివస్త్ర మహిళను అరెస్టు చేసిన పోలిసు అధికారిపై విచారణ

Posted: 07/17/2015 07:14 PM IST
Police officer being investigated for handcuffing naked woman in her home

మహిళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఓ పోలీసు అధికారి.. అమె వివస్త్రంగా వున్నా పట్టించుకోకుండా బలవంతగా అరెస్టు చేయడం కలకలం రేపింది. సదరు పోలీసు అధికారిపై న్యాయస్థానం విచారణకు అదేశించింది. అయితే ఇది జరిగింది మాత్రం మానవీయ విలువలకు దర్ఫణం పడతామని ప్రగల్భాలు పలికే అగ్రరాజ్యం అమెరికాలో. అమెరికాలోని అరిజోనా ప్రావిన్సులో గల చాండ్లర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మహిళపై దౌర్జన్యకాండను ప్రదర్శించిన సదరు అధికారిపై పిర్యాదు చేసినా అక్కడి అధికారులు స్పందించకపోవడంతో సదరు మహిళ అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్ ను టీవీలకు విడుదల చేసి.. సదరు అధికారిపై న్యాయపోరాటానికి దిగింది.

వివరాల్లోకి వెళ్తే.. అరిజోనా మహిళ ఎస్మరెల్డా రోసీకి ఇంటికి ఇద్దరు పోలీసు అధికారులు వచ్చారు. వారిని చూడగానే రోసీ కూతరు కంగారుపడి స్నానం చేస్తున్న తల్లికి సమాచారం అందించింది. దీంతో తమ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారంటూ తెలుసుకునేందుకని రోసి ఒంటి చుట్టూ టవల్ కట్టుకుని వెళ్లింది. ఈ లోపు ఇద్దరు పోలీసులు అమె వద్దకు వెళ్లి అమె డొమెస్టిక్ వాయిలెన్స్ కు పాల్పడిందని తమకు సమాచారం అందిందంటూ అమెను ప్రశ్నించారు. దీనికి రోసి ధీటుగానే బుదులిచ్చారు. తాను తనతో విడిపోయిన భర్తకు మాత్రమే ఫోన్ చేశానని బదులిచ్చింది. ఇది డొమెస్టిక్ వాయిలెన్స్ కిందకు రాదని ఎదురు ప్రశ్నించింది.

పిర్యాదుపై విచారణకు వస్తే.. మాపైనే తీవ్రస్వరంతో చిర్రుబుర్రులాడుతావా..? అంటూ అమెపై పోలీసు అధికారి డాగ్ రొస్ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతలో డ్రైస్ మార్చుకుని వస్తానని వెళ్తున్న మహిళను అగమని లేదంటే అరెస్టు చేస్తామని రొస్ హెచ్చరించాడు. తన లివ్వింగ్ రూప్ లోకి వెళ్తున్న మహిళపై అడ్డగించి దేతులు వెనక్కు కలియదిప్పి సంకెళ్లను వేశాడు. దర్యాప్తుకు వచ్చిన పోలీసులపైనే తీవ్రస్వరంతో లేస్తావా..? పోలీసులు ఏమైనా అంటే పడాలి అంటూ సెలవిచ్చాడు. ఆ తరువాత అమె కూతురు తన సంకెళ్లను తీసింది. అయితే పోలీసులు తన తల్లితో వ్యవహరించిన తీరును పక్కనే వుండి ఏడుస్తున్న అమె కూతరు సెల్ ఫోన్ లో రికార్డు చేసింది. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులకు పిర్యాదు చేసినా స్పందించక పోవడంతో.. ఏకంగా అమె న్యాయపోరాటానికి దిగింది. మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరు.. వీడియో రూపంగా బయటకు వచ్చేసరికి దానిని పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అదేశించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US police  arrest  Chandler Police  naked women  Doug Rose  Esmerelda Rossi  

Other Articles