hollywood actress Amber Heard Charged With Dog Smuggling, Faces Up to 10 Years in Prison | dog smuggling

Hollywood actress amber heard could face ten years in prison in dog smuggling case

amber heard news, amber heard latest, amber heard dog smuggling, amber heard updates, amber heard hot photos, amber heard news, amber heard gallery, johnny depps wife amber heard, amber heard with dogs

Hollywood actress Amber Heard could face ten years in prison in dog smuggling case : Amber Heard could face ten years in prison as she is charged with illegally smuggling pet dogs Pistol and Boo into Australia on a private jet.

కుక్కలతో హాలీవుడ్ శృంగారతార యవ్వారం

Posted: 07/17/2015 10:18 AM IST
Hollywood actress amber heard could face ten years in prison in dog smuggling case

కొందరు నటీమణులు గత్యంతరం లేక సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. ఇండియన్ పరిశ్రమలోని తారల విషయం కాస్త పక్కనపెడితే.. ఇటువంటి వ్యవహారాల్లో హాలీవుడ్ భామల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్, స్టార్ డమ్, కావలసినంత డబ్బు వున్నప్పటికీ కొంతమంది భామలు ఏదో ఓ స్కామ్ లో పట్టుబడుతుంటారు. ఇప్పుడు తాజాగా మరో హాలీవుడ్ శృంగారతార కూడా సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. హాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ హీరో జానీ వెప్ భార్య, నటి అంబర్ హెర్డ్.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటి అంబర్ హెర్డ్ ముందస్తు అనుమతి లేకుండా రెండు వేర్వేరు జాతులకు చెందిన కుక్కలను ఆస్ట్రేలియాకు తరలించింది. దీంతో అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమెపై పలు అభియోగాలు మోపుతూ స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా ఆస్ట్రేలియాకు కుక్కలను దిగుమతి చేయడం, తప్పుడు ధృవీకరణ పత్రాలు కలిగి వుండటం వంటి ఆరోపణలను ఆ నటిపై మోపారు. ఇందుకుగాను ఆమె క్వీన్ ల్యాండ్ కోర్టు ఎదుట సెప్టెంబర్ 7న హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఒకవేళ హెర్డ్ పై నమోదైన ఆరోపణలు రుజువైతే.. ఆమెకు పదేళ్ల జైలుశిక్షతోపాటు 48 వేల అమెరికన్ డాలర్ల జరిమానా కట్టాల్సి వస్తుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amber heard  johnny depps  dog smuggling  

Other Articles