Chandrababu Naidu | Godavari Pushkaralu | AP | Rajahmundry | Kovvuru

Chandrababu naidu full focus on godavari pushkaralu

Chandrababu Naidu, Godavari Pushkaralu, AP, Rajahmundry, Kovvuru

Chandrababu naidu full focus on Godavari Pushkaralu. By the Incident in Rajammundry ap cm chandrababu naidu, fully focused on Godavari pushkaralu.

చంద్రబాబు కనుసన్నల్లో ఏపి గోదావరి పుష్కరాలు

Posted: 07/17/2015 10:35 AM IST
Chandrababu naidu full focus on godavari pushkaralu

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2003లో అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన గోదావరి మహా పుష్కరాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీవినీ ఎరుగని రీతిలొ అంగరంగ వైభవంగా సాగిన పుష్కరాల వైభవం గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఏపికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి గొదావరి పుష్కరాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే రాజమండ్రి వద్ద పుష్కరాలను చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కొద్ది సేపట్లోనే తొక్కిసలాట జరిగి 27 మంది చనిపోవడం సంచనం రేపింది. అయితే పుష్కరాల నిర్వహణలో చంద్రబాబు నాయుడు విషఫమయ్యారని.. అధికారులు నిర్లక్షంగా వ్యవహిరించారని దుమ్మెత్తిపోశాయి ప్రతిపక్షాలు.

Also Read:  గోదావరి బాలమ్మ రేవు ఘాట్ లో మొసలి కలకలం
Also Read:  దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతిచెందడంతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలత చెందారు. ఏకంగా కంట తడి పెట్టిన బాబు.. తప్పు జరిగి ఉంటే క్షమించండి అంటూ జనాలను కోరారు. జరిగిన తప్పును ఒప్పుకొని.. మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఇక మొదటి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుండి పుష్కరాలను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూంలోనే ఉంటూ పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇక భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రాజమండ్రి మీద ఎక్కువ దృష్టిసారించారు. కొవ్వూరులోనూ ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన చేసి ఏర్పాట్లను పరిశీలించారు. రాజమండ్రి ఘటన తర్వాత ప్రతితపక్షాలు చేస్తున్న ఆరోపణలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతర్మదనంలో పడినట్లు తెలుస్తోంది.

Also Read:  విషాదం తీవ్రంగా కలిచి వేసిందంటూ పవన్ ట్వీట్..
Also Read:  చావు రాజకీయాలు అంటే ఇవే..!

మొదటి రోజు జరిగిన తప్పు.. మరోసారి పునరావృతం కాకూడదు అంటే స్వయంగా తానే పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజమండ్రిలోనే మకాం వేసిన చంద్రబాబు నాయుడు అక్కడి నుండే అన్ని పనులను నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు వస్తున్న భ:క్తులను అడిగి ఏర్పాట్ల మీద ఎంక్వైరీ చేస్తున్న బాబు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగనట్లు చూస్తున్నారు. రాజమండ్రి పుష్కారల సందర్భంగా నిర్వహిస్తున్న గోదావరి మహా హారతిని భక్తుల మధ్యే కూర్చొని చూశారు. చంద్రబాబు వస్తున్న సమయంలో సెక్యూరిటీ చేస్తున్న హడావిడి వల్ల  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనట్లుగా మామూలు భక్తుడిగా మమేకమవుతున్నారు. అయినా ఇదేదో ముందే చేసి ఉంటే  బాగుండేది కదా అని కొంత మంది.. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు మారారు అని మరికొందరు అనుకుంటున్నారు.

By Abhinavachary

Also Read:  చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Godavari Pushkaralu  AP  Rajahmundry  Kovvuru  

Other Articles