Poverty | India | Govt | Survey

Half of rural india touched by poverty

Socio Economic, Caste Census, paints grim, rural picture, help improve, social schemes, SECC 2011, seven-eight decades, one out of three families living in villages, labour for livelihood, finance , minister, arun jaitley, rural development minister, Chaudhary Birendra

Half of rural India touched by poverty India has a problem at hand and its magnitude is much higher than what was imagined or reported. That is the short and succinct message of the socio-economic caste census (SECC) released.

నా గ్రామం.. నిరుపేద గ్రామం.. భారత గ్రామాల ముఖచిత్రం ఇది

Posted: 07/04/2015 09:02 AM IST
Half of rural india touched by poverty

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో మూడో వంతు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇది ఎవరో చెబుతున్న లెక్కలు కావు.. ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన ఎస్‌ఇసిసి 2011 వివరాలు తెలిపింది. ఎనిమిది దశాబ్దాల్లో తొలిసారిగా నిర్వహించిన ఈ గణన వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ గణన ద్వారా ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పేదరిక నిర్మూలనా పథకాలను రూపొందించాలని జైట్లీ అన్నారు.

Also Read:  అవును.. చెడ్డరోజులే వచ్చాయి: మోదీ

గ్రామీణ ప్రాంతాల వారికి గరిష్టంగా 5వేలు నెలసరి వేతనం పొందుతున్నారని సర్వేలో వెల్లడైంది. గ్రామీణుల్లో కేవలం 4.6 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని గణనలో తెలిపారు. వేతన ఆదాయం పొందే వారు దాదాపు పదిశాతం మంది ఉండగా ఎస్‌సి వర్గానికి చెందిన వారు 3.49 శాతం మంది, ఎస్టీ వర్గానికి చెందిన వారు 3.34 శాతం మంది వున్నారని ఎస్‌ఇసిసి 2011 వెల్లడించింది.

Also Read:  పెంచలేక బిడ్డను దూరం చేసుకున్న తల్లి

ఈ గణాంకాల వివరాలను విడుదల చేసిన అనంతరం మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ గణన పత్రం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని తెలియజేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన పథకాల రూపకల్పనలో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత సహాయకారిగా వుంటుందని ఆయన చెప్పారు.పేదరిక నిర్మూలన కోసం గ్రామపంచాయితీలతో కలిసి బడుగు కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ పథకాలను రూపొందిస్తామని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే దేశవ్యాప్తంగా వున్న మొత్తం 24.39 కోట్ల కుటుంబాలలో కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే 17.91 కోట్ల కుటుంబాలున్నట్లు తేల్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles